SRK VS PRABHAS: సలార్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. షారుఖ్ తో ఢీకొట్టనున్న ప్రభాస్!

Salaar Movie: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సలార్. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 25, 2023, 10:31 PM IST
SRK VS PRABHAS: సలార్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. షారుఖ్ తో ఢీకొట్టనున్న ప్రభాస్!

Salaar Release date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీ కోసం అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబరు 28న రిలీజ్ చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. కొన్ని రోజులగా దీని గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. తాజాగా డార్లింగ్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తూ కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  

సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మెుదటి భాగానికి ‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ అని టైటిల్ పెట్టారు. అయితే ఈ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబరు 22న తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ కొత్త రిలీజ్ డేట్‍కు సంబంధించి సలార్ ఎగ్జిబిటర్లకు మెయిల్స్ కూడా వెళ్లాయని ఆయన పేర్కొన్నారు. సలార్ వరల్డ్ వైడ్ గా డిసెంబరు 22న రిలీజ్ అవుతుందని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ విషయంపై హొంబాలే ఫిల్మ్స్ అధికారిక ప్రకటన చేస్తుందని కూడా ఆయన రాసుకొచ్చారు. ఈ సందర్భంగా షారుఖ్ వర్సెస్ ప్రభాస్ తప్పేలా లేదని అన్నారు. 

బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్ నటించిన డుంకీ చిత్రం కూడా అదే రోజున విడుదల కానుంది. దీంతో సలార్ వర్సెస్ డుంకీ, ఎస్‍ఆర్‌కే వర్సెస్ ప్రభాస్ ఉంటుందని తరుణ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఒకవేళ సలార్ రేసులో ఉంటే డుంకీ అదే రోజు వస్తుందా లేక వాయిదా పడుతుందా అనేది ఇప్పుడు అందరిలోనూ నెలకొన్న ప్రశ్న. 

Also Read: Pushpa 2 Updates: పుష్ప 2 డిజిటల్ రైట్స్ కు రికార్డు స్థాయి ధర.. ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందంటే?

సలార్ మూవీలో ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‍ రోల్ లో కనిపించనున్నారు. హొంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీకి రవి బస్సూర్ సంగీతం అందించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సలార్ రిలీజ్ కానుంది. 

Also Read: Prabhas-Sreeleela: ప్రభాస్ నెక్ట్స్ సినిమాలో శ్రీలీల.. స్టోరీ ఇదే? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News