Guntur Kaaram Collections: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం గుంటూరు కారం. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా కావడంతో ఈ చిత్రం పై మొదటి నుంచే భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదలైన మొదటి రోజు నుంచి ఈ చిత్రం నెగటివ్ టాక్ సొంతం చేసుకోవడం స్టార్ట్ చేసింది. మరోపక్క ఈ సినిమా విడుదల రోజే హనుమాన్ సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ పైన రెండో రోజు తీవ్ర ప్రభావం పడుతుంది అనుకున్నారు అందరూ.
అయితే మరి అంతలా ఢీలా పడకుండా ఈ చిత్రం రెండో రోజు కూడా కలెక్షన్స్ పరంగా పరవాలేదు అనిపించుకుంది. కానీ హనుమాన్ సూపర్ హిట్ టాక్ వల్ల ఈ చిత్రానికి మొదటి రోజు కంపేర్ చేస్తే రెండో రోజు డ్రాప్ మాత్రం ఎక్కువగానే కనిపిస్తోంది.ఈ సినిమా రెండు రోజుల్లో రూపాయలు. 127 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు కొద్ది నిమిషాల ముందే సినిమా మేకర్స్ ఒక పోస్ట్ విడుదల చేశారు. కలెక్షన్ తో కూడిన పోస్టర్ ని రిలీజ్ చేసి మహేష్ బాబు అభిమానులకు పండగ వాతావరణం తెచ్చి పెట్టారు.
రమణగాడి 𝗦𝗨𝗣𝗘𝗥 𝗦𝗔𝗡𝗞𝗥𝗔𝗡𝗧𝗛𝗜 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥 💥#GunturKaaram grosses over 𝟏𝟐𝟕 𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 in 2 Days Worldwide 🔥
ఈ భోగికి మీలో ఉన్న Egos & Haterd కాల్చేస్తారు అని ఆశిస్తూ, మీ అందరికి భోగి శుభాకాంక్షలు ✨
Watch the #BlockbusterGunturKaaram at cinemas… pic.twitter.com/hh05ln6Qzj
— Guntur Kaaram (@GunturKaaram) January 14, 2024
‘ఈ భోగిలో మీలో ఉన్న ఈగోలను కాల్చేస్తారు అని ఆశిస్తూ.. మీ అందరికీ భోగి శుభాకాంక్షలు..’ అంటూ ఆ పోస్టర్ కింద రాశారు సినిమా యూనిట్. కాగా ఈ చిత్రం తొలి రోజు రూపాయలు 94 కోట్ల గ్రాస్ సాధించి మహేష్ బాబు కెరియర్ లో బిగ్గెస్ట్ ఓపెన్ డే సినిమాగా మిగిలింది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే. చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన కారణంగా రమణ(మహేష్ బాబు) తల్లి వసుంధర (రమ్యకృష్ణ) అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అమ్మకి దూరంగా పెరిగిన రమణ జీవితంలోకి మళ్ళీ తన తాత (ప్రకాష్ రాజ్) వల్ల పాతికేళ్ల తర్వాత తల్లి ప్రస్తావన వస్తోంది. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో రమణ మళ్ళీ తన తల్లిని చేరుకున్నాడా ?, లేదా ?, అసలు వసుంధర తన కొడుకుని ఎందుకు వదిలేసింది ?, ఈ దూరానికి కారణం ఎవరు ? అనేది మిగిలిన కథ.
ఈ సినిమాని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు.
Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
Also Read: Home Loan Rates: హోమ్ లోన్స్ గుడ్ న్యూస్..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook