Prasanth Varma: రన్వీర్ సింగ్ కి ఇండైరెక్ట్ కౌంటర్.. ప్రశాంత్ వర్మ ట్వీట్ అర్థం అదేనా!

Prasanth Varma - Ranveer Singh: హను మ్యాన్ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత.. ప్రశాంత్ వర్మ బాలీవుడ్ లో.. ఒక సినిమా ఒప్పుకున్నారు. ఆ సినిమా షూటింగ్ మొదలవుతుంది అనుకున్న సమయంలో.. సినిమాలో హీరోగా నటించాల్సిన రన్వీర్ సింగ్ సినిమా.. నుంచి తప్పుకున్నారు. అయితే తాజాగా ఇప్పుడు.. ప్రశాంత్ వర్మ పెట్టిన ట్వీట్ రన్వీర్ సింగ్ గురించి ఏనా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. 

Written by - Vishnupriya | Last Updated : Jul 8, 2024, 05:36 PM IST
Prasanth Varma: రన్వీర్ సింగ్ కి ఇండైరెక్ట్ కౌంటర్.. ప్రశాంత్ వర్మ ట్వీట్ అర్థం అదేనా!

Jai Hanuman Update: హను మ్యాన్ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత ప్రశాంత్ వర్మకి.. స్టార్ స్టేటస్ వచ్చేసింది. హను మ్యాన్ సినిమాకి సీక్వెల్ జై హనుమాన్ కూడా ప్రకటించారు. కానీ ఆ సినిమా మొదలయ్యేలోపే..ప్రశాంత్ వర్మ బాలీవుడ్ లో రన్వీర్ సింగ్ హీరోగా..రాక్షస్ అనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

Add Zee News as a Preferred Source

సినిమా ప్రీ ప్రొడక్షన్ కి సంబంధించిన.. పనులు కూడా పూర్తయిపోయి.. చిత్ర బృందం మూడు రోజులు సినిమా షూటింగ్ కూడా చేసినట్లు తెలుస్తోంది.  అంతా బాగానే అవుతుంది అనుకున్న సమయంలో రన్వీర్ సింగ్.. అనుకోకుండా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇద్దరి మధ్య క్రియేటివ్ వివాదాలు రావడం వల్ల ఇలా జరిగిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా సినిమా క్యాన్సిల్ అవడంతో ప్రశాంత్ వర్మ ఇప్పుడు మళ్లీ జై హనుమాన్ సినిమా మీద దృష్టి పెడుతున్నారు.

అయితే తాజాగా ప్రశాంత్ వర్మ పెట్టిన.. రన్వీర్ సింగ్ గురించేనా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. "ఏదో ఒక రోజు ప్రతి రిజెక్షన్.. మారువేషంలో ఉన్న దీవెన అని మీకు అర్థం అవుతుంది" అని ప్రశాంత్ వర్మ.. ట్విట్టర్ ద్వారా.. అభిమానులతో పంచుకున్నారు. 

 

అయితే రిజెక్షన్ అని దేని గురించి ప్రశాంత్ వర్మ మాట్లాడుతున్నారు? రన్వీర్ సింగ్ తో సినిమా పోవడం గురించేనా..అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అందులో నిజా నిజాలు తెలియాల్సి ఉన్నాయి.

ఇక జై హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్న ప్రశాంత్ వర్మ మరొకవైపు.. నందమూరి బాలకృష్ణ తనయుడైన నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకి కూడా దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరోవైపు రన్వీర్ సింగ్ కూడా ఈ మధ్యనే రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని సినిమాతో.. బ్లాక్ బస్టర్ అందుకున్నారు.తాజాగా ఇప్పుడు సింగం ఎగైన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు.

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..

Read more:Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News