'మహావీర కర్ణ'గా విక్రమ్.. 300 కోట్ల బడ్జెట్

శివపుత్రుడు, అపరిచితుడు, ఐ లాంటి సినిమాలతో తెలుగులో కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో విక్రమ్.

Last Updated : Jan 9, 2018, 03:47 PM IST
'మహావీర కర్ణ'గా విక్రమ్.. 300 కోట్ల బడ్జెట్

శివపుత్రుడు, అపరిచితుడు, ఐ లాంటి సినిమాలతో తెలుగులో కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో విక్రమ్. ఇప్పుడు ఆయనను హీరోగా పెట్టి  మహాభారతంలోని కర్ణుడి కథ ఆధారంగా తమిళంలో ఓ చిత్రాన్ని తీయడానికి ప్లాన్ చేస్తున్నారు.  యునైటెడ్‌ ఫిలిం కింగ్‌ సంస్థ నిర్మించే ఈ చిత్రానికి మలయాళ దర్శకుడు ఆర్‌ఎస్‌ విమల్‌ దర్శకత్వం వహిస్తారని వినికిడి. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు. ప్రస్తుతం విక్రమ్ నటించిన 'స్కెచ్' చిత్రం సంక్రాంతికి విడుదల అవుతుందన్న విషయం తెలిసిందే. ఆ చిత్రం విడుదల అయ్యాక 'మహావీర కర్ణ' చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందనేది ఇండస్ట్రీ టాక్. 2018 సంవత్సరాంతంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Trending News