Prabhas Salaar: బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ సినిమా ఈ మధ్యనే విడుదలైంది. వార్ ఫేమ్ సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పడుకొనే హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జనవరి 25న థియేటర్లలో విడుదలైంది.
బాలీవుడ్ లో ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. కానీ మిగతా భాషలలో సినిమా ఫ్లాప్ అయిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా కలెక్షన్లు అంత గొప్పగా లేవు. అయితే తాజాగా ఈ సినిమా ఓటిటి లో విడుదలైంది. చిత్ర డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే థియేటర్ల లో అంతంతమాత్రంగానే కలెక్షన్లు అందుకున్న ఈ చిత్రం ఓటిటి లో మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమాకి ఓటిటి భారీ ఆదరణ లభించింది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ, మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్లాక్ బ్లాక్ బస్టర్ సినిమా అయిన సలార్ కంటే ఈ సినిమాకి ఎక్కువ వ్యూస్ లభించడం అభిమానులను సైతం షాక్ కి గురిచేసింది.
భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా కథ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు నిర్వహించిన ఒక్ మిషన్ చుట్టూ తిరుగుతుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాకి 5.9 మిలియన్ గ్లోబల్ వ్యూస్ దక్కాయి. డంకీ, సలార్ సినిమాల కంటే ఈ సినిమాకి ఎక్కువ వ్యూస్ లభించాయి.
షారుక్ ఖాన్ డంకీ సినిమాకి 4.9 మిలియన్ వ్యూస్ లభించగా ప్రభాస్ సలార్ సినిమాకి 1.6 మిలియన్ వ్యూస్ మాత్రమే లభించాయి. కానీ. థియేటర్లలో అంతంతమాత్రంగా ఆడిన ఫైటర్ సినిమా మాత్రం ఈ రెండు సినిమాల కంటే ఎక్కువ వ్యూస్ అందుకొని సర్ప్రైజ్ ఇచ్చింది.
అయితే సలార్ హిందీ వర్షన్ హాట్ స్టార్ లో విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ వారు సలార్ ను కేవలం సౌత్ ఇండియన్ భాషలలో మాత్రమే విడుదల చేశారు కాబట్టి సినిమా వ్యూస్ తక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఫైటర్ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతున్న సినిమాలలో మొదటి స్థానాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా నాన్ ఇంగ్లీష్ సినిమాలలో ఈ చిత్రానికి మూడవ స్థానం లభించింది.
Also Read: Nikhil Siddhartha TDP: హీరో నిఖిల్ సిద్ధార్థ్ సంచలనం.. అనూహ్యంగా టీడీపీలో చేరిక
Also Read: KTR Fire: కేకే, కడియం వంటి వాళ్లు మళ్లీ వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి రానివ్వం: కేటీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Salaar OTT: డంకీ, సలార్ సినిమాలని తలదన్నిన ఫ్లాప్ సినిమా.. ఎక్కడంటే