Jabardasth Varsha And Emmanuel : జబర్దస్త్ వర్ష, ఇమాన్యుయేల్ జోడికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరపై జబర్దస్త్ షోతో ఈ ఇద్దరికీ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. జంటగా వేసిన స్కిట్లు, వారి రొమాంటిక్ ట్రాక్ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. మధ్యలో ఈ జోడి చేసిన అతికి జనాలు చీదరించుకోవడం మొదలుపెట్టారు. దీంతో మధ్యలో జబర్దస్త్ షోలో వర్ష, ఇమాన్యుయేల్ ట్రాక్ తగ్గించారు. అన్నాచెల్లెళ్లుగా నటించేశారు.
సోషల్ మీడియాలో మాత్రం వర్ష, ఇమాన్యుయేల్ మీద రకరకాల వార్తలు వస్తుంటాయి. స్టేజ్ మీద, స్కిట్ల తరువాత వర్ష వేసే డైలాగ్స్, ఇమాన్యుయేల్ ఇచ్చే రియాక్షన్ల మీద నెటిజన్లు ట్రోల్స్ చేస్తుంటారు. మీమ్స్ వేస్తుంటారు. కానీ ఇద్దరి ట్రాక్ మాత్రం బుల్లితెరపై ట్రెండ్ అవుతూనే ఉంటుంది. వర్ష ఇమాన్యుయేల్ లవ్‌లో ఉన్నారంటూ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోన్నారంటూ రూమర్లు వస్తూనే ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook