Jacqueline Fernandez in Sukesh Chandrasekhar case: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రేపు బుధవారం ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరు కానుంది. రెండు రోజుల క్రితమే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ముంబై ఎయిర్ పోర్టు నుంచి దుబాయ్‌కి వెళ్తుండగా అధికారులు ఆమెను అడ్డుకున్న సంగతి తెలిసిందే. 200 కోట్ల రూపాయల ఎక్స్‌టార్షన్ కేసులో (Rs 200 crore extortion case) ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సంబంధాలు కలిగి ఉందనే అనుమానాలతోనే ఈడి అధికారులు ఆమెపై లుకౌట్ నోటీస్ జారీచేశారు. ఈ నేపథ్యంలోనే ముంబై ఎయిర్ పోర్టులో ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విచారణకు హాజరు కానుంది. సుకేష్ చంద్రశేఖర్‌తో ఆమెకు ఉన్న సంబంధం, వాళ్లిద్దరి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు, సుకేష్ చంద్రశేఖర్ నుంచి ఆమె అందుకున్న బహుమతుల జాబితా, తదితర అంశాలపైనే ఈడి అధికారులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని (Jacqueline Fernandez) ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.
Also read : Youtuber Shreya Muralidhar's death : కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ శ్రియా మురళీధర్ మృతి
ఇటీవలే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సన్నిహితులను ప్రశ్నించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్ అధికారులు.. సుకేష్ చంద్రశేఖర్‌తో ఆమెకు ఉన్న సంబంధాలపై (Jacqueline Fernandez's relationship with Sukesh Chandrasekhar) వారి నుంచి కీలక వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది. వాళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధాలపై ఇప్పటికే చాలా వరకు కీలక సమాచారం రాబట్టిన అనంతరమే మరింత పూర్తి సమాచారం కోసమే ఈడి ఆమెను ప్రశ్నించేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook