జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్

అరవింద సమేత టీజర్ లాంచింగ్ డేట్

Last Updated : Aug 10, 2018, 01:25 PM IST
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడు తెలుసుకుందామా అని ఎదురుచూస్తు్న్న వార్తల్లో ఇదీ ఒకటి. అదే యంగ్ టైగర్ కొత్త సినిమా అరవింద సమేత టీజర్ లాంచింగ్ డేట్. అవును, టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదటిసారి ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా కావడంతో అరవింద సమేత సినిమాపై తెలుగు ఆడియెన్స్‌లో ఈ సినిమాపై ప్రత్యేక అంచనాలున్నాయి. ముఖ్యంగా తారక్ అభిమానులు ఈ సినిమా అప్‌డేట్స్‌పై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి పెడుతున్నారు. గతంలో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి సైతం వారి నుంచి భారీ స్పందన కనిపించింది. అందుకే వారికి అరవింద సమేత టీజర్ లాంచింగ్ డేట్ వివరాలు కచ్చితంగా ప్రత్యేకమే. 

 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని ఎన్టీఆర్ అభిమానులకు స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ తమ ట్విటర్ పేజ్ ద్వారా వెల్లడించింది. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డె జంటగా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. 

Trending News