Keerthi Suresh: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్..!

Keerthi Suresh Upcoming Movies: పెళ్లిపై రూమర్స్ వస్తున్న నేపథ్యంలో రఘు తాత మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న కీర్తి సురేష్ వ్యక్తిగత,  కుటుంబ జీవిత విషయాలపై వచ్చే రూమర్స్ పట్టించుకోను అంటూ క్లారిటీ ఇచ్చింది.  ఈ క్రమంలో ఆమె పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చింది ఈ హీరోయిన్. ప్రస్తుతం సౌత్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్.. తన పెళ్లి గురించి ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం..  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 26, 2024, 10:23 PM IST
 Keerthi Suresh: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్..!

Keerthi Suresh Wedding: ప్రముఖ సీనియర్ హీరోయిన్ మేనక కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కీర్తి సురేష్ , చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది.  హీరోయిన్ గా మలయాళం లో మొదటిసారి ఎంట్రీ ఇచ్చినా..  ఆ తర్వాత 2016లో మొదటిసారి తెలుగులో నేను శైలజ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. 

ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సినిమాలో నటించి ఏకంగా జాతీయ అవార్డును దక్కించుకుంది కీర్తి సురేష్. ఇక అప్పటి నుంచి మహానటి కీర్తిసురేష్ గా కీర్తింపబడుతోంది. ఇదిలా ఉండగా తాజాగా కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ అనిరుధ్ తో ప్రేమలో ఉందని, కొన్ని రోజులు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత కీర్తి సురేష్ తల్లి మేనక స్పందించడంతో ఆ రూమర్ కాస్త ఆగిపోయింది. ఆ తర్వాత పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకోబోతోంది అంటూ మళ్ళీ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై ఎవరు స్పందించలేదు. 

తాజాగా ఈమె నటిస్తున్న చిత్రం రఘు తాత.. సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా చేపట్టారు చిత్ర బృందం. అందులో పాల్గొన్న కీర్తి సురేష్ పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది. చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి దీనిపై మీ స్పందన ఏమిటి అని మీడియా మిత్రులు ప్రశ్నించగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్ పై మనం క్లారిటీ ఇచ్చినా సరే అవి నిజమనే నమ్ముతారు. అందుకే నేను అలాంటి రూమర్ పై స్పందించను. కానీ నా నటన గురించి,  సినిమాల ఎంపిక గురించి ఏమైనా వార్తలు వస్తే మాత్రం వాటిని తప్పకుండా స్వీకరిస్తాను. వాటి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కానీ వ్యక్తిగత జీవితం కుటుంబం గురించి ఎవరైనా కామెంట్లు చేస్తే వాటిని పట్టించుకోను అంటూ కామెంట్లు చేసింది కీర్తి సురేష్.

Also Read: RBI Recruitment 2024: ఆర్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. గ్రేడ్‌ B పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

Also Read: Sun Transit 2024: ఆగస్టు 16న సొంత రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News