MS Subbulakshmi Biopic: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో లెజెండరీ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. కీర్తి సురేష్ ఈ సినిమాలో సావిత్రి పాత్రలో నటించారు అనడం కంటే జీవించారు అనడం కరెక్ట్. 2018 లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు కూడా అందుకుంది.
సినిమా విడుదలై ఆరేళ్లు పూర్తయినప్పటికీ ఇప్పటికీ సినిమాలోని కొన్ని అద్భుతమైన సన్నివేశాలు ప్రేక్షకుల కళ్ళముందే కదలాడుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. సావిత్రి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి కీర్తి సురేష్ నటించిన విధానం అలాంటిది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు కీర్తి సురేష్ కి మరొక సెలబ్రిటీ బయోపిక్ చేసే అవకాశం వచ్చింది.
ప్రముఖ గాయని ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ లో కీర్తి సురేష్ సుబ్బలక్ష్మి పాత్రలో కనిపించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి తెలియని వారు ఉండరు.
ఆమె పాడిన వెంకటేశ్వర సుప్రభాతంతోనే ప్రతి ఒక్కరి రోజు మొదలవుతుంది. ప్రస్తుతం ఆమె జీవితాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. నిర్మాణ సంస్థ, దర్శకుడు ఇతరత్రా వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ టైటిల్ రోల్ లో మాత్రం కీర్తి సురేష్ నటించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.
బయోపిక్ అయినప్పటికీ సుబ్బలక్ష్మి జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. మధురైలో ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమె ప్రపంచమంతా కీర్తించే సింగర్ గా ఎదిగిన జర్నీలో ఎన్నో చెప్పుకోదగ్గ ఘట్టాలు ఉన్నాయి.
1997లో భర్త చనిపోయాక పాడటం కూడా ఆపేసిన ఎమ్మెస్ సుబ్బలక్ష్మి 2004లో కన్నుమూశారు. ఇప్పటికీ ఆమె పాటల రూపంలో ఆమె ప్రేక్షకుల గుండెల్లో స్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆమె పాడిన భక్తి పాటలు ఎవరినైనా ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్లేలా చేస్తాయి.
పేరుకి తమిళనాడులో పుట్టినప్పటికీ సుబ్బలక్ష్మి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. లక్షల్లో అభిమానులు ఉన్న ఆమె ఆడియో క్యాసెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడు అయ్యేవి. ఆమె జీవిత చరిత్రను వెండితెరపై చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అలాంటి అమర గాయని ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాత్రలో కీర్తి సురేష్ ని చూడాలని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. ఒకవేళ కీర్తి సురేష్ తో సినిమా కుదరకపోతే త్రిష లేదా నయనతార లను సంప్రదించే అవకాశం ఉంది.
Also Read: KT Rama Rao: సమాజానికి పట్టిన చీడపురుగు తీన్మార్ మల్లన్న.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
Also Read: U Tax Scam: ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలనం.. రేవంత్ ప్రభుత్వంపై 'యూ ట్యాక్స్' పేరుతో మరో బాంబు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter