Keerthy Suresh: ఆకట్టుకుంటున్న ‘గుడ్ లక్ సఖి’ ట్రైలర్

మహానటి సినిమాతో ఫ్యాన్స్ విపరీతమైన ఫాలోయింగ్‌తోపాటు, జాతీయ అవార్డును అందుకున్న కీర్తి సురేష్ ( Keerthy Suresh ) ‘‘మన రాతను మనమే రాసుకోవాలి’’ అని అంటోంది. అవునండి.. కీర్తి సురేష్ లేడీ ఓరియంటెడ్ పాత్రలో నటిస్తున్న 'గుడ్ లక్ సఖి' చిత్రం ట్రైలర్ ( Good luck Sakhi teaser ) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం విడుదలైంది. 

Last Updated : Aug 15, 2020, 12:10 PM IST
Keerthy Suresh: ఆకట్టుకుంటున్న ‘గుడ్ లక్ సఖి’ ట్రైలర్

Good luck Sakhi teaser: మహానటి సినిమాతో ఫ్యాన్స్ విపరీతమైన ఫాలోయింగ్‌తోపాటు, జాతీయ అవార్డును అందుకున్న కీర్తి సురేష్ ( Keerthy Suresh ) ‘‘మన రాతను మనమే రాసుకోవాలి’’ అని అంటోంది. అవునండి.. కీర్తి సురేష్ లేడీ ఓరియంటెడ్ పాత్రలో నటిస్తున్న ‘గుడ్ లక్ సఖి’ చిత్రం ట్రైలర్ ( Good luck Sakhi teaser ) స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా శనివారం విడుదలైంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ మరోసారి విభిన్నమైన పాత్రను చేస్తోంది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ( Adi Pinishetty ), జగపతిబాబు ( Jagapathi Babu ), రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఒక పల్లెటూరి అల్లరి పిల్ల ఏకంగా రైఫిల్ షూటర్ ( Shooter ) గా ఎలా ఉన్నత శిఖరాలకు చేరుకుంది అనే విషయాన్ని ఈ చిత్రంలో తెరకెక్కిస్తున్నారు. ఈ టీజర్ విడుదల కాగానే అందరినీ ఆకట్టుకుంటోంది. 

జాతీయ అవార్డు గ్రహీత నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్న గుడ్ లక్ సఖి చిత్రాన్నిదిల్ రాజు సమర్పకుడిగా సుధీర్, శ్రావ్య వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇది ఏకకాలంలో తెలుగు, తమిళం, మలయాళ భాషలల్లో తెరకెక్కుతోంది. ఇటీవలనే మూవీ పోస్టర్ విడుదల చేస్తూ.. గుడ్ లక్ సఖి మూవీ టీజర్‌ను ఆగస్టు 15న విడుదల చేస్తామని అంతకుముందే మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. Also read: Patriotic songs: దేశ భక్తిని తట్టిలేపే టాప్ 10 బాలీవుడ్ పేట్రియాటిక్ సాంగ్స్

ఇదిలాఉంటే.. ప్రస్తుతం ఈ గుడ్ లక్ సఖి చిత్రంతోపాటు కీర్తి సురేష్ నితిన్‌కు జోడిగా 'రంగ్‌దే'లో, అదేవిధంగా మహేష్ బాబు సర్కారు వారిపాటలో క‌థానాయిక‌గా నటిస్తూ బిజీగా ఉంది. Also read: Sundeep Kishan: సందీప్ కిషన్‌ పెళ్లి ఫిక్స్ అయిందా ? అమ్మాయి ఎవరు ?

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x