Kiccha Sudeep : సినిమాలకు దూరంగా స్టార్ హీరో.. బ్రేక్ తీసుకున్న కిచ్చా సుదీప్

Kiccha Sudeep Takes Break కిచ్చా సుదీప్ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చాడట. కొన్ని రోజుల పాటు తన కోసం తాను టైం కేటాయించుకుని, సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాడట. అందుకే ఇలా బ్రేక్ తీసుకున్నానంటూ చెప్పుకొచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 2, 2023, 06:16 PM IST
  • నెట్టింట్లో కిచ్చా సుదీప్ పోస్ట్ వైరల్
  • సినిమాలకు బ్రేక్ తీసుకున్నానంటూ పోస్ట్
  • కారణాలు చెప్పిన కన్నడ స్టార్ హీరో
Kiccha Sudeep : సినిమాలకు దూరంగా స్టార్ హీరో.. బ్రేక్ తీసుకున్న కిచ్చా సుదీప్

Kiccha Sudeep Takes Break స్టార్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. సినిమాలు హిట్టయినా, ఫట్టయినా కూడా కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. సౌత్ స్టార్ హీరోలంతా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు కన్నడ నుంచి హీరోలంతా కూడా పాన్ ఇండియాకు వెళ్తున్న విషయం తెలిసిందే. విక్రాంత్ రోణతో కిచ్చా సుదీప్ కూడా పాన్ ఇండియా ట్రై చేశాడు. కానీ ఈ సినిమా అంతగా ఆడలేదు.

కన్నడలో ఈ సినిమా హిట్టుగానే నిలిచింది. అయితే ఈ సినిమా తరువాత ఇంత వరకు కిచ్చా సుదీప్ ఇంకో కొత్త ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ఆయన సినిమాలు మానేశాడంటూ ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. వాటిపై తాజాగా కిచ్చా సుదీప్ స్పందించాడు. తాను  సినిమాలకు బ్రేక్ ఇచ్చానని, సీసీఎల్ ఆడుతూ కాస్త బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.

 

'నేను సినిమాలు త్వరగా చేయడం లేదని, నెక్ట్స్ సినిమా అప్డేట్లు ఇవ్వడం లేదని వస్తోన్న మీమ్స్, ట్రోల్స్ చూస్తున్నాను.. విక్రాంత్ రోణ వంటి సినిమాలు తీసిన తరువాత నేను చాలా అలిసిపోయాను.. కాస్త విశ్రాంతి తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను.. కరోనా టైంలో ఎంతో కష్టపడి ఆ సినిమాను తీశాం. బిగ్ బాస్ షోకు కూడా అదే టైంలో పని చేశాను. 

ఇక నా కొరకు నేను నా సంతోషం కోసం నేను ఇలా బ్రేక్ తీసుకున్నాను.. క్రికెట్ ఆడుకుంటూ ఉంటే నాకు ఎంతో రిలాక్సింగ్‌గా ఉంటుంది.. అలా దాన్ని ఎంజాయ్ చేసుకుంటూనే.. రోజూ కథలు వింటూనే ఉన్నాను.. ఇప్పటికే మూడు ప్రాజెక్ట్‌లు ఓకే అయ్యాయి.. అంటే మూడు స్క్రిప్ట్‌లు రెడీగా ఉన్నాయి.. వాటి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటి కోసం నేను కొత్తగా రెడీ అవ్వాల్సి ఉంటుంది. అందుకే ఇలా గ్యాప్ తీసుకున్నాను. త్వరలోనే అధికారికంగా సినిమాలను ప్రకటిస్తాను' అని కిచ్చా సుదీప్ చెప్పుకొచ్చాడు.

 Also Read:  Dasara Collection : దసరా ఊచకోత.. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్?.. నాని దెబ్బకు బాక్సాఫీస్ బద్దల్

Also Read: Janhvi Kapoor Pics : అందాలను ఒడిసిపట్టినట్టుగా.. కాక పుట్టించేలా జాన్వీ కపూర్ లుక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News