KA Movie OTT Streaming: ఈ రోజు నుంచి ప్రముఖ ఓటీటీలో కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్లర్ ‘క’ మూవీ స్ట్రీమింగ్.. KA Movie OTT Streaming: ఈ రోజు నుంచి ప్రముఖ ఓటీటీలో కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్లర్ ‘క’ మూవీ స్ట్రీమింగ్..

KA Movie OTT Streaming: టాలీవుడ్ లో ముందు నుంచి డిఫరెంట్  చిత్రాలతో ఆడియన్స్ ను పలకరిస్తున్నాడు కిరణ్ అబ్బవరం.  అంతేకాదు మల్టీ టాలెంటెడ్ గా దర్శకుడిగా సత్తా చూపెడుతున్నాడు. ఈయన హీరోగా సుజిత్, సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘క’. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ మూవీ  ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 28, 2024, 01:15 AM IST
KA Movie OTT Streaming: ఈ రోజు నుంచి ప్రముఖ ఓటీటీలో కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్లర్ ‘క’ మూవీ స్ట్రీమింగ్..  KA Movie OTT Streaming: ఈ రోజు నుంచి ప్రముఖ ఓటీటీలో కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్లర్ ‘క’ మూవీ స్ట్రీమింగ్..

KA Movie OTT Streaming: తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు ఎపుడు ఆదరణ ఉంటుంది. ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘క’. థ్రిల్లర్  జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని ఇచ్చింది. అంతేకాదు గత కొన్నేళ్లుగా హిట్టు కోసం చూస్తోన్న కిరణ్ అబ్బవరం ఈ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. అంతేకాదు చిన్న సినిమాగా విడుదలై దాదాపు రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఈ రోజు (నవంబర్ 28) నుంచి ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ఫస్ట్ టైమ్, డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీతో ‘క’ మూవీ స్ట్రీమింగ్ కు వస్తుండటం విశేషం. ఓటీటీల్లో ఇదొక కొత్త ట్రెండ్ క్రియేట్ చేయబోతోందనే చెప్పాలి. థియేటర్స్ లో వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ తో ఈటీవీ విన్ లో ‘క’ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఈటీవీ విన్ యాప్ లో కొత్త సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కా అని చెప్పొచ్చు.

‘క’ చిత్రంలో  కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు.  శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ సినిమాను అత్యంత భారీగా నిర్మించారు.  సుజీత్, సందీప్ ద్వయం "క" సినిమాతో దర్శకులుగా తమ సత్తా ఏమిటో చూపించారు. "క" సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి విడుదల చేయడం విశేషం. మలయాళంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు.

గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో కుదేలైన  కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా  ‘క’చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.  దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో సొంతం చేసుకుంది.  ప్రీమియర్స్ తో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడం విశేషం. తెలుగులో గతంలో ఇలాంటి తరహా స్టోరీ  రాలేదని ఆడియన్స్  చెప్పుకుంటున్నారు. క్లైమాక్స్ లో ఊహించని ట్విస్టులు ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ లా నిలిచి ఈ సినిమా విజయంలో కీ రోల్ ప్లే చేశాయి.  కిరణ్ అబ్బవరం తన కెరీర్ లో మంచి యాక్టింగ్ తో అదరగొట్టాడనే కామెంట్స్ వినిపించాయి.

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News