Love Today Scene: తమిళనాడులో ఫోన్లు మార్చుకున్న లవ్ కపుల్.. 'ఆ' వీడియోలు బయటపడడంతో మొదటికే మోసం!

Love Today Scene Repeated: గత ఏడాది తమిళ సినీ పరిశ్రమలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలలో లవ్ టుడే సినిమా సీన్ రిపీట్ అయింది, దీంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 21, 2023, 03:34 PM IST
Love Today Scene: తమిళనాడులో ఫోన్లు మార్చుకున్న లవ్ కపుల్.. 'ఆ' వీడియోలు బయటపడడంతో మొదటికే మోసం!

Love Today Scene Repeated: గత ఏడాది తమిళ సినీ పరిశ్రమలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలలో లవ్ టుడే సినిమా కూడా ఒకటి. ప్రదీప్ రంగనాథన్ హీరోగా దర్శకుడిగా తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ రోజుల్లో ప్రేమికులు ఎలా ఉంటున్నారు? వారి మధ్య ప్రేమ ఎలా ఉంటుంది? అసలు ప్రేమ ఎలా ఉండాలి? అనే అంశాలను స్పృశిస్తూ తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ కావడంతో తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు.

ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు అనుకోకుండా తమ ఫోన్లు మార్చుకోవాల్సి వస్తుంది. హీరోయిన్ తండ్రి పెట్టిన కండిషన్ మేరకు ఫోన్లు మార్చుకున్న ఈ జంట చివరికి ఒకరి గురించి ఒకరు తెలుసుకుని చివరికి ఒకటయ్యారా? లేదా? అనే అంశం మీద ఈ సినిమా తెరకెక్కించారు. అయితే తాజాగా అదే సీన్ రిపీట్ అయింది. తమిళనాడులోని బేలూరు అనే ప్రాంతానికి చెందిన అరవింద్ అనే 23 ఏళ్ల కుర్రాడు ఒక ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతను తరచూ వెళ్లే ఒక హాస్పిటల్ లో నర్స్ తో అతనికి పరిచయమవగా, ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది.

పెద్దలను ఒప్పించి వీరు వివాహానికి సిద్ధమయ్యారు, ఇటీవలే వారి నిశ్చితార్థం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు ఫోన్లలో గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండేవారు. అయితే లవ్ టుడే సినిమాలో లాగా మనం ఎందుకు చేయకూడదు? అని భావించిన ఈ జంట ఒకరి ఫోన్లు ఒకరు మార్చుకున్నారు. అలా మార్చుకున్న సమయంలో ఆ యువతీకి యువకుడి ఫోన్లో అభ్యంతరకరమైన విషయాలు కనిపించాయి. సదరు యువకుడి ఫోన్ లో ఒక పదో తరగతి చదువుతున్న అమ్మాయిని నగ్న ఫొటోలు, వీడియోలు కనిపించడమే కాక అదే అమ్మాయితో సదరు యువకుడు రొమాన్స్ చేసిన వీడియోలను కూడా యువతి గుర్తించింది.

వెంటనే తాను మోసపోయాను అనే విషయం అర్థం చేసుకోవడమే కాక అప్పటికప్పుడు నిశ్చితార్థం క్యాన్సిల్ చేయించి వెంటనే మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలు పెట్టి అతనిని అరెస్టు చేశారు. ఆయన రొమాన్స్ చేసిన అమ్మాయి మైనర్ కావడం ఆమె పదో తరగతి చదువుతూ ఉండడంతో ఆమె విషయాలు గోప్యంగా ఉంచి అతని మీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం తమిళ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది, ఎప్పటికప్పుడు అదే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Also Read: VSR vs WV Collections: ఒకే రోజు-ముప్పై కోట్ల తేడా.. 'వీర సింహా' vs వీరయ్య బాక్సాఫీస్ పోటీ చూశారా?

Also Read: Waltair Veerayya Day 8 Collections: 100 కోట్లు కొట్టేసిన చిరు.. టాలీవుడ్ లో 14వ సినిమాగా ఎంట్రీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News