Samantha: లవ్ యూ నల్గొండ.. నా గుండెల్లో ప్రత్యేకం స్థానం ఉంది: సమంత

Samantha openes Mangalya Shopping Mall in Nalgonda: ఈరోజు ఉదయమే నల్గొండ చేరుకున్న సమంత మాంగల్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 'లవ్ యూ నల్గొండ' అంటూ ట్వీట్ చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2022, 03:16 PM IST
  • షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో సమంత
  • లవ్ యూ నల్గొండ
  • నా గుండెల్లో ప్రత్యేకం స్థానం ఉంది
Samantha: లవ్ యూ నల్గొండ.. నా గుండెల్లో ప్రత్యేకం స్థానం ఉంది: సమంత

Samantha openes Mangalya Shopping Mall in Nalgonda: టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతైన్యతో విడాకుల అనంతరం స్టార్ హీరోయిన్ సమంత ఫుల్ జోష్‌లో ఉన్నారు. టాలీవుడ్, బాలీవుడ్, వెబ్ సిరీస్ అనే తేడా లేకుండా వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇస్తన్నారు. ప్రస్తుతం సమంత షూటింగ్స్, వెకేషన్స్ అంటూ ఫుల్ బిజీబిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తున్నారు. తన మూవీ అప్డేట్స్, వెకేషన్స్‌కు సంబందించిన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు నిత్యం టచ్‌లోనే ఉంటున్నారు. 

హీరోయిన్ సమంత బుధవారం (ఫిబ్రవరి 23) తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఈరోజు ఉదయమే నల్గొండ చేరుకున్న సామ్.. మాంగల్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమంత రిబ్బన్ కట్ చేసి.. మాంగల్య షాపింగ్ మాల్‌ను ఓపెన్ చేశారు. ఎరుపు రంగు పట్టు చీరలో సామ్ అందంగా ముస్తాబయ్యారు. సామ్ నగరానికి వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ఫాన్స్.. మాంగల్య షాపింగ్ మాల్‌ దగ్గరికి భారీ స్థాయిలో వచ్చారు. 

మాంగల్య షాపింగ్ మాల్‌ ఓపెనింగ్ కోసం వస్తున్న సమయంలో సమంత తన కారు లోంచి అభిమానులను ఆత్మీయంగా పలకరించారు. కారు దిగాక ఫాన్స్ నుంచి పుష్ప గుచ్చాలు కూడా అందుకున్నారు. అనంతరం కొందరితో సామ్ సెల్ఫీలు కూడా దిగారు. తనపై ప్రేమ కురిపిస్తున్న అందరికిక్ ధన్యవాదాలు చెప్పారు. ఇందుకు సంబందించిన పోటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'లవ్ యూ నల్గొండ.. నా గుండెల్లో ప్రత్యేకం స్థానం ఉంది' అని కాప్షన్ ఇచ్చారు. 

భారీ సెట్టింగుల డైరెక్టర్ గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స‌మంత లీడ్ రోల్‌లో తెర‌కెక్కుతున్న 'శాకుంత‌లం' చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. విఘ్నేశ్ శివ‌న్ డైరెక్ష‌న్‌లో న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తితో క‌లిసి 'కాతువాకుల రెండు కాధ‌ల్' అనే సినిమాలో కూడా సామ్ నటించారు. ఈ రెండు సినిమాలు వేసవిలో విడుద‌ల‌ కానున్నాయి. హరి-హరీశ్ దర్శక ద్వయంలో తెరకెక్కుతున్న 'య‌శోద' సినిమాలో స‌మంత ప్రధాన పాత్ర చేస్తున్నారు. పాన్ ఇండియాగా తెరకెక్కిన సినిమా కూడా త్వరలోనే విడుదల కానుంది. 

Also Read: Wriddhiman Saha - Journalist: ఆ జర్నలిస్ట్ ఇంకా క్షమాపణలు చెప్పలేదు.. బీసీసీఐ దర్యాప్తు చేస్తోంది: సాహా

Also Read: IND vs SL: టీమిండియాకు భారీ షాక్‌.. శ్రీలంకతో టీ20 సిరీస్ నుంచి ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఔట్‌!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News