Tarun Next Movie: లవర్ బాయ్ అనగానే తెలుగు ప్రేక్షకులకు ఒకప్పుడు గుర్తొచ్చే హీరో.. తరుణ్. నువ్వే కావాలి, నువ్వే నువ్వే, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను.. ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ ప్రేమ కథల్లో నటించి.. యువతలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు ఈ హీరో. ఒకప్పుడు తరుణ్ సినిమాలు వస్తున్నాయి అంటే.. అందరూ ఎంతగానో ఎదురు చూసేవారు. అలాంటి ఈ హీరో పదేళ్లుగా సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. దీంతో అతని ఫాన్స్ కొంత నిరాశకు గురయ్యారు. కాగా తాజాగా గుడ్ న్యూస్ చెప్పాడు తరుణ్. రీఎంట్రీని ప్రకటించాడు.
చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో కనిపించిన తరుణ్.. నువ్వే కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత వరుస ప్రేమ కథలు చేస్తూ.. మంచి విజయాలు అందుకున్నారు. అయితే ఆ తరువాత ఆ లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటపడలేకపోయాడు. దాంతో వరుసగా అలాంటి సినిమాలే చేస్తూ.. లవర్ బాయ్ అనే ట్యాగ్ తో తెలుగు ఇండస్ట్రీలో ఫిక్స్ అయిపోయారు. కానీ వరుసగా అలాంటి సినిమాలే తీయడం ఆయన.. కెరీర్‌ని దెబ్బతీసింది. మాస్ సినిమాలు తరుణ్ కి అసలు సెట్ కాకపోవడంతో…మరో పక్క ఆయన లవ్ స్టోరీస్ వరసగా ఫ్లాప్ అవ్వడంతో.. చిన్నగా స్టార్ డమ్ తగ్గుతూ వచ్చింది.
మరోపక్క తరుణ్,ఆర్తి అగర్వాల్ ప్రేమ కథ కూడా కొద్ది రోజులు కాంట్రవర్సీలకు దారితీసింది. ఇక చేసేదేమీ లేక ఈ హీరో.. చివరికి మొత్తంగా సినిమాలు చేయడం మానేశాడు. ప్రస్తుతం ఈ హీరో చాలా కాలం నుంచి తన బిజినెస్ లు.. చూసుకుంటున్నట్టు వినికిడి. ఈ మధ్య తరుణ్ అమ్మగారు..సీనియర్ నటి రోజారమణి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తరుణ్ కి రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నాయని, అవే చూసుకుంటున్నాడని, త్వరలో మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తాడని చెప్పుకొచ్చింది.
ఇక ఇదే విషయంపై తాజాగా తరుణ్ సైతం స్పందించాడు. తన రీఎంట్రీ విషయంతో తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. సీసీఎల్(సెలబ్రిటీ క్రికెట్ లీగ్)కి సంబంధించి టాలీవుడ్ టీమ్‌కి.. తరుణ్ కెప్టెన్ అని మనకు తెలిసిన విషయమే. దీనికి సంబంధించి కర్టెన్ రైజర్ ఈవెంట్ ఈ మధ్యనే గ్రాండ్గా నిర్వహించారు. ఇందులో తరుణ్ ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన రీఎంట్రీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
తాను ప్రస్తుతం రెండు సినిమా ప్రాజెక్ట్స్ పై వర్క్ చేస్తున్నట్టు తెలిపాడు. ఒకటి సినిమా అని, మరోటి వెబ్ సిరీస్ అన్నట్టుగా తెలిపారు ఈ హీరో. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్ట్స్ కి సంబంధించిన వర్క్ జరుగుతోందని.. ఒకటి రెండు నెలల్లోనే వాటి అనౌన్స్ మెంట్ కూడా ఉంటుందని తెలియజేశాడు ఈ హీరో. మొత్తానికి దీంతో త్వరలోనే తాను సినిమాల్లోకి కమ్ బ్యాక్ అవుతున్నట్టు చెప్పేశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి