MAA Elections‌‌-Hema: మా ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో దుర్గమ్మకే తెలియాలి: హేమ

Actress Hema Shocking Comments : తమ ప్యానెల్‌ ఎలా ఓడిపోయిందో విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారికే తెలియాలంటూ నటి హేమ అన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆమె విజయవాడ ఇంద్రకీలాద్రిని సందర్శించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2021, 02:16 PM IST
  • తమ ప్యానెల్‌ ఎలా ఓడిపోయిందో విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారికే తెలియాలి..
  • రాత్రి గెలిచినట్లు ప్రకటించి.. ఉదయానికే ఓడిపోయారు అని చెప్పారు..
  • మా ఎన్నికల ఫలితాలపై నటి హేమ కామెంట్స్
MAA Elections‌‌-Hema: మా ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో దుర్గమ్మకే తెలియాలి: హేమ

MAA Elections 2021 actress hema comments on maa election results in vijayawada: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. రోజూ ఏదో ఒక హాట్ కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు మా సభ్యులు. (maa members) ఇక తమ ప్యానెల్‌ ఎలా ఓడిపోయిందో విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారికే (Vijayawada Kanaka Durgamma Ammavaru) తెలియాలంటూ నటి హేమ అన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆమె విజయవాడ ఇంద్రకీలాద్రిని (Vijayawada Indrakeeladri) సందర్శించారు. ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ తాను తనకు దుర్గమ్మపై అపారమైన నమ్మకం ఉందన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా దుర్గమ్మవారి (Durgamma) దీవెనలు పొందడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు హేమ.

Also Read : Manchu Vishnu: బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకున్న విష్ణు.. ఈ నెల 16న ప్యానల్‌తో ప్రమాణ స్వీకారం

ఆనందంతో తనకు కన్నీళ్లు వచ్చేస్తున్నాయని చెప్పింది. అయితే మా ఎన్నికల్లో రాత్రి గెలిచినట్లు ప్రకటించి.. ఉదయానికే ఓడిపోయారు అని చెప్పారన్నారు. ఇది ఎలా జరిగిందో తనకు తెలియట్లేదు అని హేమ (Hema) చెప్పారు. ఇక అందుకు కారణం ఏమై ఉంటుందో దుర్గ అమ్మవారికైనా తెలుసో లేదో అని హేమ అన్నారు. ఇక తాజాగా జరిగిన మా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ (Prakashraj Panel) తరఫు నుంచి హేమ పోటీ చేశారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి పోటీ చేసిన కొందరు మొదట గెలిచారంటూ వార్తలు వచ్చాయి. తర్వాత ఓడిపోయినట్లు మా ఎన్నికల అధికారి వెల్లడించారు. ఈ నేపథ్యంలో హేమ (Hema)చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

Also Read : Fuel rates today: వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న Petrol, డీజిల్ ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News