Niharika's wedding venue: ఉదయ్‌పూర్‌లో నిహారిక పెళ్లి.. తేదీ, వేదిక ఫిక్స్ !

మెగా బ్రదర్ నాగబాబు ( Nagababu ) కుమార్తె, నటి నిహారిక కొనిదెల, గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో లాక్ డౌన్‌లో ఘనంగా ఎంగేజ్మెంట్ ( Niharika Konidela engagement ) జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా నిహారిక కొనిదెల, చైతన్య జోన్నలగడ్డ ( Chaitanya Jonnalagadda ) పెళ్లికి తేదీ, ముహూర్తం, వేదిక నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Last Updated : Nov 4, 2020, 08:27 PM IST
Niharika's wedding venue: ఉదయ్‌పూర్‌లో నిహారిక పెళ్లి.. తేదీ, వేదిక ఫిక్స్ !

మెగా బ్రదర్ నాగబాబు ( Nagababu ) కుమార్తె, నటి నిహారిక కొనిదెల, గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో లాక్ డౌన్‌లో ఘనంగా ఎంగేజ్మెంట్ ( Niharika Konidela engagement photos ) జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజా అప్‌డేట్ ప్రకారం డిసెంబర్ 9న రాత్రి 7:15 గంటలకు నిహారిక కొనిదెల, చైతన్య జోన్నలగడ్డ ( Chaitanya Jonnalagadda ) పెళ్లికి ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. Also read : Pawan Kalyan's new look: పవన్ కల్యాణ్ న్యూ లుక్ చూశారా ?

నిహారిక కోరిక మేరకు, ఆమె తల్లిదండ్రులు డెస్టినేషన్ వెడ్డింగ్‌ ( Niharika destination wedding ) ప్లాన్ చేస్తున్నారని.. అది కూడా రాజస్థాన్‌లో చారిత్రక నేపథ్యం ఉన్న ఉదయపూర్‌లోని ది ఒబెరాయ్ ఉదైవిలాస్ ప్యాలెస్‌ని ( The Oberoi Udaivilas ) నిహారిక-చైతన్యల పెళ్లి వేదికగా ఎంచుకున్నారని టాక్ వినిపిస్తోంది. అంతకుముందు, నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం వివాహ వేదికలను ఖరారు చేయడానికి గోవాకు వెళ్లి అలాగే తన ఫ్రెండ్స్‌తో బ్యాచిలరెట్ పార్టీని ( Niharika konidela bachelorette party ) జరుపుకుంది. కానీ చివరకు ఉదయపూర్‌ను డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికగా ఎంపిక చేశారని ఫిలింనగర్ టాక్. Also read: Niharika fitness secrets: నిహారిక పెళ్లికి రెడీ అవుతోందట!

నిహారిక-చైతన్యల కుటుంబ సభ్యులు, పరిమిత అతిథుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. అయితే, దీని గురించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, ఇప్పటికే నిహారిక, చైతన్యల కుటుంబాలు వివాహానికి సన్నాహాలు ప్రారంభించాయి. Also read :  Megastar As Acharya: నవంబర్ 9 నుంచి ఆచార్య షూట్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News