Mahesh Babu vs Mega Fans: సూపర్‌స్టార్ మహేశ్ బాబు వర్సెస్ మెగాస్టార్ చిరంజీవి అభిమానుల మధ్య చర్చ ప్రారంభమైంది. ఓ విధంగా వాగ్వాదమే జరుగుతోంది. దేని గురించో తెలిస్తే ఆశ్చర్యపోతారు. సిల్లీ విషయానికి ఇంత చర్చ అవసరమా అంటున్నారు కొందరు..
సూపర్‌స్టార్ మహేశ్ బాబు సినిమా సర్కారు వారి పాట విడుదలై రెండ్రోజులవుతోంది. ప్రస్తుతం హిట్ టాక్‌తో సినిమా నడుస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో చిరంజీవి, మహేశ్ బాబు అభిమానుల మధ్య చర్చ నడుస్తోంది. సినిమా విడుదలైన తరువాత చిరంజీవి కుటుంబసభ్యులు ఇప్పటివరకూ సినిమా ఏ విధమైన కామెంట్ చేయకపోవడమే దీనికి కారణం. సర్కారు వారి పాట సినిమాపై చిరంజీవి కుటుంబసభ్యులు ఎందుకు మౌనంగా ఉన్నారనేదే అసలు చర్చకు కారణంగా ఉంది.
అదే సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాలు వకీల్ సాబ్, భీమ్లానాయక్, అల్లు అర్జున్ సినిమా పుష్ప, చిరంజీవి, రామ్‌చరణ్‌ల ఆచార్య సినిమాల విడుదలపై మహేశ్ బాబు ట్వీట్ చేసి విషెస్ అందించినా..చిరు కుటుంబసభ్యులు సర్కారు వారి పాట సినిమాపై మాట్లాడకపోవడంతో వాదన ప్రారంభమైంది. మెగా కుటుంబసభ్యులు పాజిటివ్‌గా ట్వీట్స్ చేసుంటే..సినిమా మరింతగా ప్రొమోషన్ అయ్యేది కదా అనేది కొందరి వాదన.
మెగా కుటుంబసభ్యులైన చిరంజీవి, రామ్‌చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌లు కృతజ్ఞతగానైనా మహేశ్ బాబుకు మద్దతుగా ట్వీట్ చేసుండాల్సిందనేది ప్రధానంగా విన్పిస్తున్న ప్రశ్న. చిరంజీవి ప్రస్తుతం అమెరికాలో హాలిడే వెకేషన్‌లో ఉండి బిజిగా ఉన్నాడనుకున్నా..మిగిలిన హీరోలు ఎందుకు మౌనంగా ఉన్నారని మహేశ్ బాబు ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి మహేశ్ బాబు ఏ విధమైన పట్టింపుల్లేకుండా అందరి సినిమాలపై ట్వీట్ చేస్తూ విషెస్ అందిస్తుంటాడు. అదే పని చిరు కుటుంబసభ్యులు ఎందుకు చేయడం లేదనేది మరో ప్రశ్న. మహేశ్ బాబు, రామ్‌చరణ్‌లు వాస్తవానికి మంచి స్నేహితులు అయినా..సర్కారు వారి పాట విషయంలో ఎందుకీ మౌనమనేదే అర్దం కాని చర్చ రేగుతున్న ప్రశ్నగా మిగిలిపోతోంది.
Also read: Janhvi Kapoor Bikini Pics: చేయి అడ్డుపెట్టి.. ఎద అందాలు దాచేసిన జాన్వీ కపూర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook