Godfather movie to stream on Netflix some November 19th: మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న తర్వాత గాడ్ ఫాదర్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమా అని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాని మోహన్ రాజా డైరెక్ట్ చేయగా రామ్ చరణ్, ఎన్వి ప్రసాద్, ఆర్బి చౌదరి ఈ సినిమాను కొణిదల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మించారు.
సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార భార్యాభర్తల పాత్రలలో నటించారు. అలాగే సునీల్, షఫీ, సముద్ర ఖని వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి లూసిఫర్ సినిమాతో అన్ని విషయాల్లోనూ వంకలు పెట్టి పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది కానీ సినిమా విడుదలైన తర్వాత సినిమాకి మంచి రెస్పాన్స్ అయితే దక్కింది. కానీ అనూహ్యంగా కలెక్షన్ల విషయంలో మాత్రం ఈ సినిమా వెనుకబడింది.
ట్రేడ్ వర్గాల వారు ఒక సమాచారం, సినిమా యూనిట్ మరో సమాచారం కలెక్షన్ల గురించి ప్రచురిస్తూ ఉండడంతో మీడియా ఈ విషయం మీద ప్రశ్నించగా అసలు ఈ సినిమా తెలుగులో అందుబాటులో ఉన్నా సరే సినిమా చేయడం గొప్ప విషయమని అందుకే ఈ సినిమా విషయంలో తాము కలెక్షన్స్ విషయాన్ని పట్టించుకోవడం లేదని నిర్మాత ఎన్వి ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ సంస్థ సుమారు 56 కోట్ల రూపాయలకి దక్కించుకున్నట్లు గతంలో ప్రచారం జరిగింది.
ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.నవంబర్ 19వ తేదీ నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏది రాలేదు కానీ దాదాపు సినిమా విడుదలైన సమయంలో ఓటీటీకి విధించిన ఎనిమిది వారాల గడువు పూర్తయిందని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి మెగాస్టార్ క్రేజ్ క్యాష్ చేసుకోవాలని నెట్ ఫ్లిక్స్ సంస్థ భావిస్తోందని తెలుస్తోంది.
Also Read: Jr NTR Speech At Kannada Rajyotsava : మాటల్లోనూ చేతల్లోనూ మేటి.. పునీత్‌పై ప్రేమ, మహిళలపై గౌరవం.. దటీజ్ ఎన్టీఆర్
Also Read: Salman Khan's Security: సల్మాన్ ఖాన్‌కి వై-ప్లస్ సెక్యురిటీ అందించిన సర్కారు.. ఎందుకంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook