Jr NTR cleans chair : కన్నడ రాజ్యోత్సవ వేడుకల కోసం బెంగళూరుకు ఎన్టీఆర్ వెళ్లడం, అక్కడ యంగ్ టైగర్‌ను కఘనంగా స్వాగతించడం అందరికీ తెలిసిందే. అయితే కన్నడ అసెంబ్లీ విధాన సౌధలో జరిగిన ఈ వేడుకలో ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్, ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పునీత్ రాజ్ కుమార్ మీద ప్రేమను తన మాటల్లో వ్యక్తపరిచాడు. ఇక మహిళలంటే తనకు ఎంత గౌరవమో చెప్పకనే చెప్పేశాడు. అలా ఎన్టీఆర్ మాటలు, చేతలు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.
ఎన్టీఆర్ స్టేజ్ మీద కన్నడలో స్పీచ్ మొదలుపెట్టాడు. ఎవరు ఎంతైనా సంపాదించుకోగలరు.. కానీ మంచి వ్యక్తిత్వం మాత్రం సంపాదించుకోలేరు.. అది ఎవరికి వారు సంపాదించుకుంటారు.. అలా పునీత్ రాజ్‌కుమార్ తనకు తాను ఓ గొప్ప వ్యక్తిగా, శక్తిగా ఎదిగారు.. కర్ణాటకకు సూపర్ స్టార్ అంటే అతనే. అతను ఒక గొప్ప భర్త, స్నేహితుడు, తండ్రి, డ్యాన్సర్, వీటన్నంటికి మంచి గొప్ప మనసున్న వ్యక్తి. ఇలా అంటున్నానని తప్పుగా అర్థం చేసుకోకండి..ఈ రోజు కర్ణాటక రత్న అవార్డు ఇస్తున్నారు. కానీ కర్ణాటక రత్న అర్థం అంటే.. అది పునీత్ రాజ్ కుమార్ అని ఇలా తన స్టైల్లో ఎన్టీఆర్ స్పీచుతో అదరగొట్టేశాడు.
Respect @tarak9999 ❤️#TheRajkumars #PuneethRajkumarLivesOn #Appu #PowerStar #PuneethRajkumar #DrPuneethRajkumar #KarnatakaRatnaDrPuneethRajkumar #AshwiniPuneethRajkumar #NTR #JrNTR #PuneethFC pic.twitter.com/OkkVfPSU44
— PuneethFC™ (@PuneethFC_17) November 1, 2022
ఇక స్పీచ్ మొదలు కాక ముందు స్టేజ్ మీదకు సుధా మూర్తి, పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వినీ వచ్చారు. వారు కూర్చునేందుకు సిద్దమయ్యారు. కానీ అదే సమయంలో కుర్చీని తుడుస్తున్నారు. ఎన్టీఆర్ స్వయంగా కుర్చీని తుడిచి ఇచ్చాడు. ఆశ్వినినీ, సుధా మూర్తిని కూర్చోమని గౌరవంగా అడిగాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇలా ఒకే స్టేజ్ మీద ఎన్టీఆర్ తన మాటలు చేతలతో అందరినీ మెప్పించాడు.
కన్నడకు, ఎన్టీఆర్‌కు విడదీయలేని బంధం ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తల్లి కన్నడకు చెందినవారే. అలా కన్నడ మాతృభాషగా మారింది ఎన్టీఆర్‌కు. అందుకే కన్నడ స్టార్లతోనూ ఎన్టీఆర్‌కు ముందు నుంచి కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. ఇలా ఒకే స్టేజ్ మీద రజినీ, ఎన్టీఆర్ కలిసి ఉండటం కూడా అభిమానులకు పండుగలా అనిపిస్తోంది.
Also Read : Jr NTR for Kannada Rajyothsava : బెంగళూరులో దిగిన ఎన్టీఆర్.. యంగ్ టైగర్‌కు స్వాగతం పలికిన కర్ణాటక మంత్రి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook