Waltair Veerayya Updates: శృతిహాసన్ ఈవెంట్‌కు రాకుండా ఎవరు బెదిరించారు, చిరు వ్యాఖ్యల వెనుక కారణమేంటి

Waltair Veerayya Updates: వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. శృతి హాసన్ ఈవెంట్‌కు ఎందుకు రాలేదనే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 9, 2023, 12:03 AM IST
Waltair Veerayya Updates: శృతిహాసన్ ఈవెంట్‌కు రాకుండా ఎవరు బెదిరించారు, చిరు వ్యాఖ్యల వెనుక కారణమేంటి

విశాఖపట్నంలో అత్యంత ఘనంగా జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈవెంట్‌కు గైర్హాజరైన శృతిహాసన్‌ను ఎవరో బెదిరించారంటూ చిరంజీవి చెప్పడం కలకలం రేపుతోంది. 

సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా వాల్తేరు వీరయ్య. విశాఖపట్నంలో ప్రీ రిలీజు వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన మెగాస్టార్ చిరు..కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈవెంట్‌కు హాజరు కావల్సిన శృతిహాసన్ ఎందుకు హాజరుకాలేదనే విషయంపై చిరు కీలక విషయాలు వెల్లడించారు. ఆరోగ్యం బాగాలేదని శృతిహాసన్ తనకు ఫోన్ చేసి చెప్పిందన్నారు. కానీ ఆ అమ్మాయిని ఈవెంట్‌కు రాకుండా ఎవరో బెదిరించారంటూ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంట్లో నలతగా ఉందని చెప్పిందన్నారు. కరోనా కాకుండా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పిందన్నారు. 

శృతిహాసన్‌ను ఎవరు బెదిరించారు

ఒంగోలులో ఏం తిన్నదో లేదా ఎవరైనా బెదిరించారో మరి..ఫంక్షన్‌కు రాలేదని చిరంజీవి సెటైర్లు వేయడం కాకతాళీయం కాదనే వాదన విన్పిస్తోంది. సినిమాలో శృతిహాసన్ అద్భుతంగా నటించిందని..చలిలో వణుకుతూ శ్రీదేవి పాటలో మెరిసిందన్నారు. అంత చలిలో కూడా చీరలో శృతిహాసన్ చేసిన స్టెప్పులకు హ్యాట్సాఫ్ అన్నారు. ఇదే సంక్రాంతికి విడుదలవుతున్న బాలయ్య సినిమా వీరసింహారెడ్డిలో కూడా శృతిహాసన్ హీరోయిన్. ఒంగోలులో జరిగిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజు వేడుకలో శృతిహాసన్ పాల్గొంది. కానీ వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజు వేడుకకు గైర్హాజరైంది. కారణం అనారోగ్యం అని తెలుస్తోంది. 

Also read: Waltair Veerayya: విశాఖవాసులకు చిరు కానుక, త్వరలో విశాఖలో ఇళ్లు కట్టుకోనున్న చిరంజీవి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News