Waltair Veerayya: విశాఖవాసులకు చిరు కానుక, త్వరలో విశాఖలో ఇళ్లు కట్టుకోనున్న చిరంజీవి

Waltair Veerayya: విశాఖపట్నంలో త్వరలో ఇళ్లు కడతానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ఇది తనకు చిరకాల కోరికని..ఆపై విశాఖవాసిగా మారతానన్నారు మెగాస్టార్ చిరు. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుకలో చిరు వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 9, 2023, 05:39 AM IST
Waltair Veerayya: విశాఖవాసులకు చిరు కానుక, త్వరలో విశాఖలో ఇళ్లు కట్టుకోనున్న చిరంజీవి

విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజు వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాల్తేరులో ఇళ్లు కట్టుకుంటానని ప్రకటించారు.

విశాఖలో జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుక సముద్ర కెరటాల హోరును తలపించింది. భారీగా తరలివచ్చిన జనం సమక్షంలో మెగాస్టార్ చిరు వ్యాఖ్యలకు విశాఖవాసులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. త్వరలో తాను విశాఖలో ఇళ్లు కట్టుకుంటానని..ఇప్పటికే భీమిలి సమీపంలో స్థలం కొన్నానన్నారు. తనకిష్టమైన వాల్తేరు పేరును తన సినిమాకే పెట్టడం ఆనందంగా ఉందన్నారు. విశాఖవాసులు చాలా మంచివారని..ప్రశాంతంగా ఉంటారన్నారు. త్వరలో ఇళ్లు కట్టుకోవడమే కాకుండా..విశాఖవాసిగా మారతానన్నారు. రిటైర్మెంట్ తరువాత ప్రతి ఒక్కరూ విశాఖలో ఉండాలని కోరుకుంటారన్నారు. 

అదే సమయంలో వాల్తేరు వీరయ్య సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్ అవుతుందని వ్యాఖ్యానించారు. వాస్తవానికి బాబీ తనకు పెద్ద అభిమాని అని..అయితే సినిమా సందర్భంగా అతడి హార్డ్‌వర్క్, డెడికేషన్ చూసి తానే బాబీ అభిమానిగా మారిపోయానన్నారు. వాల్తేరు వీరయ్య సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. నిఖార్సైన కమర్షియల్ హిట్ అవుతుందని స్పష్టం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రెండూ భారీ హిట్ సాధిస్తాయన్నారు చిరంజీవి. 

Also read: Waltair Veeraiah: చిరంజీవి రాజకీయాలకు పనికిరాడు, వాల్తేరు వీరయ్య వేడుకలో దర్శకుడు బాబీ కీలక వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News