Waltair Veerayya Trailers : వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల మీద కామెంట్స్.. నవదీప్ ట్వీట్స్ వైరల్

Veera Simha Reddy Trailer సోషల్ మీడియాలో ప్రస్తుతం వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్యల ట్రైలర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా నవదీప్ వేసిన ట్వీట్టు నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2023, 10:36 AM IST
  • సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య
  • సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ట్రైలర్లు
  • చిరు, బాలయ్యపై నవదీప్ ట్వీట్లు వైరల్
Waltair Veerayya Trailers : వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల మీద కామెంట్స్.. నవదీప్ ట్వీట్స్ వైరల్

Veera Simha Reddy Trailer సోషల్ మీడియాలో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి ట్రైలర్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై నవదీప్ కామెంట్స్ చేశాడు. మామూలుగానే సోషల్ మీడియాలో నవదీప్ ఎక్కువగా సెటైర్లు వేస్తుంటాడు. ఎక్కువ యాక్టివ్‌గా ఉంటాడు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి ట్రైలర్‌ల మీద ఆయన చేసిన ట్వీట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్‌కి అయినా వెళ్లి నిలబడు.. అంటూ సాగే డైలాగ్‌ అందరినీ ఆకట్టుకుంది. అయితే అదే డైలాగ్‌ను నవదీప్ ట్వీట్ వేశాడు. జై బాలయ్య.. మంట పెట్టేశాడు అంటూ నవదీప్ ట్వీట్ వేశాడు. ఇక వాల్తేరు వీరయ్య మీద సైతం నవదీప్ స్పందించాడు. రికార్డ్స్ లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయ్.. పూనకాలు లోడింగ్ అంటూ నవదీప్ ట్వీట్లు వేశాడు. అలా రెండు సినిమాల ట్రైలర్లు అదిరిపోయాయ్ అని చెప్పకనే చెప్పేశాడు.

అసలే ఈ సంక్రాంతికి తెలుగులో మంచి పోటీ నెలకొంది. చిరంజీవి వాల్తేరు వీరయ్యతో, బాలయ్య వీర సింహా రెడ్డి సినిమాతో రంగంలోకి దిగబోతోన్నాడు. ఈ రెండు సినిమాల మధ్య భీకర పోరు ఉండేలా కనిపిస్తోంది. అయితే ఇవి కాకుండా తమిళ హీరోలైన అజిత్ తెగింపు సినిమాతో, విజయ్ వారసుడు సినిమాతో బరిలోకి దిగబోతోన్నారు.

అయితే సంక్రాంతి పోటీ మీద కూడా నవదీప్ ట్వీట్ వేశాడు. ఈ సంక్రాంతికి తెలుగు థియేటర్లో జనాలు మొత్తం మటాష్.. నేను ఆ క్షణాలు చూసే వరకు ఆగలేకపోతోన్నాను అంటూ నవదీప్ ట్వీట్ వేశాడు. మొత్తానికి ఈ సంక్రాంతి పోటీ మాత్రం మంచి రసవత్తరంగా సాగేట్టు కనిపిస్తోంది.

Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?

Also Read: Roja Satires on Mega Family : ఏ ఒక్కరికీ సాయం చేయలేదట.. అందుకే ముగ్గుర్నీ ఓడించారట.. మంత్రి రోజా సంచలన కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News