Happy Birthday Yash: నేడు రాకింగ్ స్టార్ యశ్ బర్త్​ డే- కేజీఎఫ్​-2 నుంచి అప్​డేట్​!

Happy Birthday Yash: దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా కేజీఎఫ్​-2. యశ్​ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరో అప్​డేట్ వచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2022, 11:18 AM IST
  • కేజీఎఫ్​-2 నుంచి మరో అప్​డేట్​
  • యశ్​ బర్త్​ డే సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల
  • డాన్​ క్యారెక్టర్​ రిప్రజెంట్ చేసేలా లుక్​
Happy Birthday Yash: నేడు రాకింగ్ స్టార్ యశ్ బర్త్​ డే- కేజీఎఫ్​-2 నుంచి అప్​డేట్​!

Happy Birthday Yash: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ సత్తా (Indian Cinema) చాటిన.. సినిమాల ప్రస్తావన వస్తే అందులో కేజీఎఫ్​ గురించి కచ్చితంగా ఉంటుంది. కన్నడ సినిమాగా మొదలై.. వివిధ భాషల్లో ఈ సినిమా డబ్​ అయింది. ఆ తర్వాత అన్ని భాషల్లోన ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా (KGF movie Success) చెప్పనక్కర్లేదు.

ఈ సినిమాకు సీక్వెల్​గా తీసిన 'కేజీఎఫ్​ ఛాప్టర్​-2'కు సంబంధించిన అన్ని పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్​ 14 సినిమాను థియేటర్లలో (KGF 2 release date) విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్​. కరోనా నేపథ్యంలో వివిధ సినిమాలు వాయిదా పడగా..  ఈ సినిమా కూడా వాయిదా పడుతుందని అంచనాలు వచ్చాయి.. వాటన్నింటికి తాజాగా చెక్​ పెట్టింది చిత్ర బృందం.

రాకింగ్ స్టార్ లుక్ అదుర్స్​..

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో పోస్టర్ (KGF 2 new poster)​ విడుదలైంది. రాకింగ్ స్టార్​ యశ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టర్​ను విడుదల చేసింది (Happy Birthday Yesh) చిత్ర యూనిట్​.

ఈ సినిమాలో హీరో యశ్​ డాన్​గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. సీరియస్ లుక్​తో యశ్​ ముందుకు నడిచొస్తున్నట్లు ఈ పోస్టర్​లో ఉంది. యశ్​ ముందు.. 'కాషన్​.. డేంజర్ అహెడ్' అనే బోర్డు కనిపిస్తుంది. యశ్​ డాన్​ క్యారెక్టర్​ను రిప్రజెంట్ (Yesh character in KGF 2) చేసేలా పోస్టర్​ను డిజైన్​ చేశారు.

చాలా రోజుల తర్వాత సినిమా నుంచి కొత్త అప్​డేట్​ చూసి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్​ చేస్తున్నారు. యశ్ లుక్​ చూసి.. కేజీఎఫ్​ 2పై అంచనాలు ఇంకా భారీగా పెట్టుకుంటున్నారు.

కేజీఎఫ్​-2 గురించి..

ప్రశాంత్​ నీల్​ దర్శకత్వం వహించిన.. ఈ సినిమాలో యశ్​ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్​గా నటించారు. సంజయ్​ దత్, రవీనా టాండన్​, ప్రకాశ్​ రాజ్​, రావు రమేశ్​, అనంత్ నాగ్​ సహా పలువురు కీలక పాత్రలు (About KGF 2) పోషించారు.

కన్నడతో పాటు.. తెలుగు,తమిళ్​,హిందీ, మలయాళం భాషల్లో (డబ్బింగ్ వెర్షన్​) ఏకకాలంలో ఈ సినిమా విడుదల కానుంది.

Also read: Trisha Tested Covid Positive: సెలెబ్రిటీల్ని చుట్టేస్తున్న కరోనా మహమ్మారి, కారణాలేంటి

Also read: Nidhi Aggarwal: మొన్న నయనతార, త్రిష..ఇప్పుడు నిధి అగర్వాల్..త్వరలో పెళ్లి కూడా అట

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News