Pawan Kalyan's new look: పవన్ కల్యాణ్ న్యూ లుక్ చూశారా ?

Pawan Kalyan shaved his beard for Vakeel Saab shooting: కరోనావైరస్ లాక్ డౌన్ సమయంలో షూటింగ్స్ లేకపోవడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొడవాటి జుట్టుతో, భారీ గడ్డంతో కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ గడ్డంతోనే ‘వకీల్ సాబ్’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు అని మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు అని ఈ న్యూ లుక్‌తో తేలిపోయింది.

Last Updated : Nov 4, 2020, 06:43 PM IST

పవన్ కళ్యాణ్ ఫ్రెండ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో ( Art director Anand Sai with Pawan Kalyan ) పవన్ కళ్యాణ్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ చిన్నజుట్టుతో, గడ్డం కూడా ట్రిమ్ చేసుకొని ఉన్నారు. ఈ లుక్‌ని చూసి పవన్ అభిమానులు తమ హీరో మళ్లీ స్టైలిష్ లుక్‌కి వచ్చేసారు అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also read : What is Karwa Chauth: కర్వాచౌత్ అంటే ఏంటి ? కర్వాచౌత్‌కి మన అట్లతద్దికి సంబంధం ఏంటి?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. నవంబర్ 2 నుండి పవన్ వకీల్ సాబ్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రెండు వేర్వేరు గెటప్‌‌లలో కనిపించనున్నారు అని టాక్. వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ నటించిన ‘పింక్’ సినిమా రీమేక్ ( Pink movie Telugu remake ) అని తెలిసిందే. 

వాస్తవానికి బాలీవుడ్‌లో వచ్చిన పింక్ ఒరిజినల్‌ వెర్షన్‌లో కానీ, లేదా పింక్ సినిమా తమిళ రీమేక్‌లో కానీ హీరో సరసన హీరోయిన్ పాత్ర లేదు. కాకపోతే తెలుగు రీమేక్‌లో మాత్రం పవన్ కల్యాణ్ ఇమేజ్ దృష్ట్యా ఒక రొమాంటిక్ యాంగిల్ కోసం పవన్ సరసన శృతి హాసన్ ( Actress Shruti Haasan ) జోడిగా కనిపించనుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Also read : Jr Ntr on video call: వీడియో కాల్ చేసిన ఎన్టీఆర్‌ని అభిమాని ఏం అడిగాడో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News