ఎన్టీఆర్ బయోపిక్ కోసం నటీనటులు కావలెను

ఎన్టీఆర్ బయోపిక్ కోసం క్యాస్టింగ్ కాల్ 

Last Updated : Jun 5, 2018, 11:37 PM IST
ఎన్టీఆర్ బయోపిక్ కోసం నటీనటులు కావలెను

స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలయ్య బాబు టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమా కోసం నటీనటులు కావలెను అని ప్రకటించారు ఆ చిత్రనిర్మాతలు. దర్శకుడు తేజ ఆ చిత్రం నుంచి తప్పుకున్న తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ కోసం క్రిష్ జాగర్లమూడి మెగా ఫోన్ పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని తెలియజేస్తూ తమ సినిమాకు నటీనటులు కావాల్సిందిగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తోన్న వారాహీ చలన చిత్రం ఫేస్‌బుక్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. నటనపై ఆసక్తి ఉన్న వాళ్లు ఎవరైనా 30 సెకన్ల నిడివి కలిగిన రెండు వేర్వేరు వీడియోలను తమకు మెయిల్ చేయాల్సిందిగా వారాహీ చలన చిత్రం తమ ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా అభ్యర్థులు ఎవ్వరూ ప్రత్యక్షంగా తమను కలిసేందుకు తమ కార్యాలయానికి రాకూడదనే విజ్ఞప్తి చేసింది ఆ చిత్ర నిర్మాణ సంస్థ. 

 

Trending News