Adipurush Teaser : అలాంటోళ్ల కోసం ఆదిపురుష్ తీయలేదు.. టీజర్ ట్రోల్స్‌పై ఓం రౌత్ రియాక్షన్

Adipurush Teaser Trolls ఆదిపురుష్‌ టీజర్ ట్రోల్స్ ఏ రేంజ్‌లో వస్తున్నాయో అందరికీ తెలిసిందే. ఇక వీటిపై ఓం రౌత్ గట్టిగా కౌంటర్లు వేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం వాడిన వీఎఫ్‌ఎక్స్ మీద స్పందించాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 4, 2022, 05:26 PM IST
  • ఆదిపురుష్ టీజర్ ట్రోల్స్
  • వీఎఫ్‌ఎక్స్ మీద పెదవి విరుస్తున్న నెటిజన్లు
  • గట్టిగా కౌంటర్లు వేసిన ఓం రౌత్
Adipurush Teaser : అలాంటోళ్ల కోసం ఆదిపురుష్ తీయలేదు.. టీజర్ ట్రోల్స్‌పై ఓం రౌత్ రియాక్షన్

Om Raut- Prabhas- Adipurush Teaser : ప్రభాస్ ఆదిపురుష్‌ టీజర్ మీద ప్రస్తుతం జరుగుతున్న చర్చ అందరికీ తెలిసిందే. కొందరేమో వీఎఫ్‌ఎక్స్ మీద పడ్డారు. ఇంకొందరు రావణుడిని, ఆంజనేయుడిని చూపించిన తీరు మీద మండి పడ్డారు. హన్మంతుడు అలాంటి వస్త్రాలు ధరిస్తారా? రావణుడు అలా ఉంటాడా? అంటూ నానా రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. వానర సైన్యమా? లేక గాడ్జిల్లా, గొరిల్లా సైన్యమా? అంటూ తిట్టి పోస్తున్నారు. 

ఆంజనేయుడు తోలు వస్త్రాలు ధరిస్తాడా? ఆ సీన్లను తీసేయండి.. అంటూ మధ్య ప్రదేశ్ హోం మినిస్టర్ మండిపడ్డాడు. ఇలా నలు వైపుల నుంచి ఆదిపురుష్ టీజర్ మీద ట్రోలింగ్ మొదలైంది. ఇక ఇది చాలదన్నట్టుగా అజయ్ దేవగణ్ కంపెనీ నుంచి ఓ ప్రెస్ నోట్ రావడంతో మరింతగా వివాదం రాజుకుంది. ఆదిపురుష్‌ వీఎఫ్‌ఎక్స్‌కు మాకూ ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది.

అలా మొత్తానికి ఆదిపురుష్‌ టీజర్ మాత్రం దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఇంతలా ట్రోల్స్ వచ్చినా కూడా టీజర్ రికార్డులు మాత్రం అదిరిపోయాయి. 24 గంటట్లో వంద మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన టీజర్‌గా రికార్డులు క్రియేట్ చేసింది.  అయితే ఈ ట్రోల్స్ రావడంతో టీం మొత్తం పునరాలోచనలో పడిందని, మళ్లీ విజువల్స్, వీఎఫ్‌ఎక్స్ విషయంలో తిరిగి వర్క్ ప్రారంభించాలని అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

అయితే ఓం రౌత్ తాజాగా టీ సిరీస్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఇది మొబైల్ ఆడియెన్స్ కోసం తీసిన సినిమా కాదని, థియేటర్లో ఎక్స్ పీరియన్స్ చేసే వారి కోసం తీసిన సినిమా అని చెప్పుకొచ్చాడు. అయితే కొంత మంది ఈ టీజర్‌ను త్రీడీలో థియేటర్లో చూసి ఫిదా అయ్యారట. అద్భుతంగా విజువల్స్ ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు. మరి ఆదిపురుష్‌ టీం ఈ ట్రోల్స్ మీద ఎలాంటి యాక్షన్లు తీసుకుంటుందో చూడాలి. పునరాలోచనలో పడి ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందో లేదో చూడాలి.

Also Read : Chiranjeevi - pawan kalyan : పవన్ కళ్యాణ్‌కు మద్దతిస్తానేమో?.. చిరు మాటలు ఆంతర్యమిదే

Also Read : లిప్ కిస్ దెబ్బకు పీడకలలు.. రాత్రంతా ఏడుస్తూనే ఉండేదాన్ని..బాధ బయటపెట్టిన రష్మిక

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News