Panama Papers Leak Case: పనామా పేపర్ లీక్స్ కేసులో ఈడీ విచారణకు హాజరుకానున్న మరో బాలీవుడ్‌ స్టార్ హీరో..

Panama Papers Leak Case updates : పనామా పేపర్ లీక్స్ కేసులో మరో బాలీవుడ్‌ స్టార్ హీరోను ఈడీ విచారించనుందని సమాచారం. హీరో అజయ్‌దేవ్‌గన్‌ కూడా ఈ వ్యవహారంలో ఈడీ ఎదుట హాజరు కానున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2021, 04:42 PM IST
  • బాలీవుడ్ హాట్‌టాపిక్‌గా మారిన పనామా పేపర్ లీక్స్ కేసు
  • హడలెత్తిపోతున్న సెలబ్రిటీలు
  • తాజాగా ఐశ్వర్యరాయ్ ని విచారించిన ఈడీ
  • త్వరలో మరో బాలీవుడ్‌ స్టార్ హీరోను విచారించనున్న ఈడీ
Panama Papers Leak Case: పనామా పేపర్ లీక్స్ కేసులో ఈడీ విచారణకు హాజరుకానున్న మరో బాలీవుడ్‌ స్టార్ హీరో..

Panama Papers Leak Case: Bollywood Hero Ajay Devagan may be questioned in Panama Papers controversy : బాలీవుడ్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది పనామా పేపర్ లీక్స్ కేసు. దీంతో సెలబ్రిటీలు హడలెత్తిపోతున్నారు. బాలీవుడ్ స్టార్స్‌లో కొందరు విదేశాల్లో అక్రమంగా పెట్టుబడులు పెడుతున్నారంటూ ఈడీ విచారణలో తేలింది. దీంతో బాలీవుడ్ (Bollywood) స్టార్స్‌లోని కొందరినీ ఈడీ విచారిస్తుంది. తాజాగా అమితాబ్‌ బచ్చన్ (Amitabh Bachchan) కోడలు ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) ఈడీ (ED) విచారణకు హాజరైంది. 2016లో యూకేలో ప‌నామా బేస్డ్ లా సంస్థ‌కు చెందిన‌ 11.5 కోట్ల ట్యాక్స్ డాక్యుమెంట్లు లీక‌య్యాయి. అందుకు సంబంధించిన విచారణను ఈడీ చేపడుతోంది.

ఈ విషయంపై దాదాపు మూడు గంటల పాటు ఐశ్వర్యరాయ్ ని ఈడీ విచారించింది. పలు రకాల ప్రశ్నలను ఆమెను ఐశ్వర్యరాయ్‌ని ఈడీ అధికారులు అడిగారు. ఆమె ద్వారా పలు ఆసక్తికరమైన విషయాలను సేకరించారట. అయితే ఇక ఈ కేసులో మరో బాలీవుడ్‌ స్టార్ హీరోను (Bollywood‌ Star Hero) ఈడీ విచారించనుందని సమాచారం. హీరో అజయ్‌దేవ్‌గన్‌ కూడా ఈ వ్యవహారంలో ఈడీ ఎదుట హాజరు కానున్నారని తెలుస్తోంది. 

Also Read : Scrub Typhus: హైదరాబాద్‌లో స్క్రబ్ టైఫస్ కలకలం-టెన్షన్ పెట్టిస్తోన్న మరో వ్యాధి

అయితే పనామా పేపర్ లీక్స్ అయిన సమయంలోనే అజయ్‌దేవ్‌గన్ (Ajay Devagan) తన వాదన వినిపించారు. తాను పెట్టిన పెట్టుబడలన్నీ కూడా చట్టం ప్రకారం పెట్టానని అప్పట్లో పేర్కొన్నారు. అయితే ఈ విషయంపైనే అజయ్ దేవగన్‌ని ఈడీ విచారించనుందట.

Also Read : Omicron Case in Hyderabad: హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ లో ఒమిక్రాన్ కేసు నమోదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News