July 1st OTT Releases: విరాటపర్వం టు ధాకడ్.. నేడు ఏయే సినిమాలు, సిరీసులు రిలీజయ్యాయంటే?

July 1st OTT Releases:జూలై 1వ తేదీన అంటే ఈరోజు చాలా వరకు సినిమాలు,  వెబ్ సిరీసులు ఓటీటీలలో స్ట్రీమ్ అవుతున్నాయి. మరి ఏయే ఓటీటీలో ఏయే సినిమాలు,  సిరీసులు స్ట్రీమ్ అవుతున్నాయి అనే విషయం మీద ఒక కన్నేద్దాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 1, 2022, 03:15 PM IST
  • ఆసక్తికరంగా ఓటీటీ రిలీజులు
  • అన్ని ఓటీటీలలో సినిమాలు, సీరీసులు
  • ఏయే ఓటీటీలో ఏమేం రిలీజ్ అయ్యాయంటే?
July 1st OTT Releases: విరాటపర్వం టు ధాకడ్.. నేడు ఏయే సినిమాలు, సిరీసులు రిలీజయ్యాయంటే?

July 1st OTT Releases: కరోనా తరువాత థియేటర్ల కంటే ఎక్కువగా ఇంట్లో అందరితో కలిసి ఓటీటీలో సినిమాలు చూడడానికే ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే మేకర్స్ సినిమాలకు ధీటుగా వెబ్ సిరీస్ ల నిర్మాణం మీద కూడా ద్రుష్టి పెట్టారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు,  వెబ్ సిరీస్లు నేరుగా ఓటీటీ వేదికగా రిలీజ్ అవుతున్నాయి. ఇక జూలై 1వ తేదీన అంటే ఈరోజు చాలా వరకు సినిమాలు,  వెబ్ సిరీసులు ఓటీటీలలో స్ట్రీమ్ అవుతున్నాయి. మరి ఏయే ఓటీటీలో ఏయే సినిమాలు,  సిరీసులు స్ట్రీమ్ అవుతున్నాయి అనే విషయం మీద ఒక కన్నేద్దాం. 

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ రోజు ఒక సినిమా రెండు సిరీసులు స్ట్రీమ్ అవుతున్నాయి. అందులో అక్షయ కుమార్ హీరోగా నటించిన సామ్రాట్ పృథ్వీ రాజ్ ఒకటి స్ట్రీమ్ అవుతోంది. జూన్ మూడున థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను చంద్రప్రకాష్ ద్వివేది యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన ఈ సినిమా ఓటీటీలో ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనే చూడాలి.  ఇక ఆంటోనీ ఫుకువ,  ఎల్లెన్ కురాస్,  సంయుక్తంగా తెరకెక్కించిన ద టెర్మినల్ లిస్ట్ కూడా స్ట్రీమ్ అవుతోంది. అలాగే కుంగ్‌ఫూ పాండా: ద పాస్‌ ఆఫ్‌ డెస్టినీ రెండో సీజన్‌ కూడా నేటి నుంచి స్ట్రీమ్ అవుతోంది. 

ఇక నెట్ ఫ్లిక్స్ లో రెండు సిరీసులు రెండు సినిమాలు అందుబాటిలోకి వచ్చాయి. ముందుగా రెబెల్డీ రెండో సీజన్‌ సహా స్ట్రేంజర్‌ థింగ్స్‌ నాలుగో సీజన్‌ రెండో వాల్యూమ్‌ విడుదల అవుతున్నాయి. అలాగే 2011లో విడుదలైన ద క్రేగ్స్‌లిస్ట్‌ కిల్లర్‌ సినిమా విడుదలవుతోంది. అలాగే రానా, సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం సినిమా స్ట్రీం అవుతోంది. ఇక దేశీ ఓటీటీ అయిన ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌ లో సునీల్ మంచంద దర్శకత్వం వహించిన క్రైమ్ సిరీస్‌ మియా బీవీ ఔర్‌ మర్డర్‌ స్ట్రీమ్ అవుతోంది. ఇక జీ 5 యాప్ లో కంగనా డిజాస్టర్ మూవీ ధాకడ్‌,  దీప్తి గుప్తా తెరకెక్కించిన షటప్‌ సోనా కూడా విడుదల అవుతున్నాయి. రాహుల్ నాయర్ తెరకెక్కించిన మలయాళ మూవీ కీడం ,  బాపూ బహర్‌ భేజ్దే సినిమాలు కూడా స్ట్రీమ్ అవుతున్నాయి. 
Also Read:Pakka Commercial Movie Review: గోపీచంద్- రాశిఖన్నాల సినిమా ఎలా ఉందంటే?

Also Read: Malavika Mohanan Pics: బాబోయ్ మాళవిక మోహనన్.. అందాలన్నీ చూపిస్తూ చంపేస్తుందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News