Tollywood: తొలిసారి చారిత్రాత్మక సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Tollywood: రాజకీయ ఆరంగేట్రం తరువాత పవన్ కళ్యాణ్ టాలీవుడ్ రీ ఎంట్రీ గ్రాండ్‌గా జరిగింది. వకీల్ సాబ్‌తో సరికొత్త రికార్డు సృష్టించిన జనసేనాని మరో వినూత్న కథాంశంతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 22, 2021, 04:10 PM IST
Tollywood: తొలిసారి చారిత్రాత్మక సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Tollywood: రాజకీయ ఆరంగేట్రం తరువాత పవన్ కళ్యాణ్ టాలీవుడ్ రీ ఎంట్రీ గ్రాండ్‌గా జరిగింది. వకీల్ సాబ్‌తో సరికొత్త రికార్డు సృష్టించిన జనసేనాని మరో వినూత్న కథాంశంతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు.

టాలీవుడ్‌లో(Tollywood) మరో గ్రాండ్ ఫిక్షన్ సినిమా తెరకెక్కబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా  చేస్తున్న చారిత్రాత్మక సినిమా ఇది. రాజకీయాల్లో ప్రవేశించడంతో దాదాపు మూడేళ్లపాటు పరిశ్రమకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్..వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ గ్రాండ్‌గానే ఇచ్చాడు. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా హిందీ మూవీ పింక్ ఆధారిత చిత్రం. పవన్ కళ్యాణ్ మేనరిజంకు తగ్గట్టు..తెలుగు నేటివిటీ పోకుండా జాగ్రత్తగా తీయడంతో ప్రేక్షకుల్ని హత్తుకుంది. హిట్‌టాక్ మూటగట్టుకుంది. 

ఇప్పుడు క్రిష్ (Krish) దర్శకత్వంలో తొలిసారిగా పవన్ కళ్యాణ్ (Pawan kalyan) చారిత్రాత్మక సినిమాలో నటించబోతున్నాడు. హరిహర వీలమల్లుగా వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న నిది అగర్వాల్..జాక్వెలిన్ మొఘల్ రాణి పాత్రను పోషిస్తోంది. ఏఎం రత్నం నిర్మాతగా ఉన్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తోనే వస్తోంది. కోట్లాది రూపాయల ఖర్చుతో మొఘల్ కట్టడాల సెట్స్ వేస్తున్నారు. అన్నింటి కంటే మించి..కథాపరంగా ఈ సినిమాకు గ్రాఫిక్స్ పెద్ద హైలైట్ కాబోతున్నాయి. అందుకే కేవలం గ్రాఫిక్స్ కోసమే 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు. హాలీవుడ్ టెక్నిషియన్స్‌ని నియమించడమే దీనికి కారణం. విజ్యువల్ వండర్‌గా ఈ సినిమూను తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా చేస్తున్న హిస్టారికల్ మూవీ (Historical movie) కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Also read: Sarkau vaari Paata first look: సర్కార్ వారి పాట ఫస్ట్ లుక్ పోస్టర్ అప్‌డేట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x