Kalki 2898 AD: ఆ స్టార్ హీరో నిడివి తక్కువే.. కల్కి2898AD అభిమానులకు షాక్

Prabhas: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమాలో కమల్ హాసన్ కూడా ఒక పాత్ర చేయబోతున్నారు. దీంతో ఇప్పటికే సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. కానీ తాజాగా సినిమా లో కమల్ హాసన్ పాత్ర గురించి వినిపిస్తున్న ఒక వార్త అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 26, 2024, 07:40 AM IST
Kalki 2898 AD: ఆ స్టార్ హీరో నిడివి తక్కువే.. కల్కి2898AD అభిమానులకు షాక్

Kamal Haasan: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కల్కి 2898 ఏడి. ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

గతంలో చిత్ర బృందం ఈ సినిమా మే 9న విడుదల అవుతుంది అని ప్రకటించింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తుంటే సినిమా విడుదల వాయిదా పడేలాగానే అనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక తెలుగు రాష్ట్రంలో.. కేవలం ఎన్నికల వేడి మాత్రమే నడుస్తోంది. ఈ సమయంలో సినిమా విడుదల చేయడం అంత మంచిది కాదని నిర్మాతల అభిప్రాయం.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను నిర్మిస్తున్న వైజయంతి మూవీ బ్యానర్స్ వారు ఈ సినిమా విడుదల ను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పక్కన పెడితే ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కమల్ హాసన్ ది కీలక పాత్ర కాదట. ఆయన పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందని ఆయనది కేవలం ఒక చిన్న క్యామియో మాత్రమే అని తెలుస్తోంది. ఈ విషయాన్ని కమల్ హాసన్ చెప్పడం విశేషం. కేవలం ఇందులో అతిథిగా నటించానని, తన పార్ట్ కి సంబంధించిన షూటింగ్ ముగిసింది అని ఈ మధ్య ఒక ప్రముఖ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు. అయితే తన క్యారెక్టర్ ఎలా ఉంటుందో మాత్రం కమల్ బయట పెట్టలేదు.

ఈ క్రమంలో సినిమాలో కమల్ హాసన్.. ప్రభాస్ పాత్రలకి మధ్య యాక్షన్ ఎపిసోడ్స్ సైతం ఉంటాయేమోనని.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు కమల్ మాటలతో నిరాశ ఎదురయింది.

ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్న చిత్ర బృందం త్వరలో ప్యాచ్ వర్క్ కూడా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నత. ఏప్రిల్ రెండో వారంలోపు సినిమా ప్యాచ్ వర్క్ కూడా పూర్తిచేసి విడుదల కి రెడీ చేయాలని సమాచారం. కానీ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ సమయం పట్టేలాగా కనిపిస్తోందట.. అందువల్ల కూడా సినిమా మే తొమ్మిదిన విడుదలవుతుందా లేదా అనే విషయంపై క్లారిటీ రావడం లేదు. మొత్తానికి అన్ని దాటుకొని ఈ చిత్రం ట్రై చేయండి సెంటిమెంట్ మే 9న విడుదలవుతుందా లేదా పోస్ట్ పోన్ అవుతుందా తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.

Also Read:  Love Guru Trailer: 'లవ్‌గురు'తో వస్తున్న బిచ్చగాడు హీరో.. ట్రైలర్‌ చూస్తే నవ్వులే

Also Read:  Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News