Radhe Shyam: రేపటి నుంచి ఇటలీలో రాధేశ్యామ్ షూటింగ్ మొదలు

ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం యూరోప్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతుంది.

Last Updated : Sep 30, 2020, 09:02 PM IST
    • ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
    • రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం యూరోప్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతుంది.
    • 60వ దశకంలో జరిగే ఒక ప్రేమకథ చిత్రం ఇది.
Radhe Shyam: రేపటి నుంచి ఇటలీలో రాధేశ్యామ్ షూటింగ్ మొదలు

ప్రభాస్ ( Prabhas ) ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం యూరోప్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతుంది. 60వ దశకంలో జరిగే ఒక ప్రేమకథ చిత్రం ఇది. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde ) కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీలో ఆమె డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం..

ALSO READ| Trump Residency: బిజినెస్ ట్రంప్ బ్లెడ్ లోనే ఉంది... ఇల్లు రాజభవనం కన్నా తక్కువేం కాదు

తాజా సమాచారం ప్రకారం ప్రభాస్, పూజా హెగ్డే, రాధేశ్యామ్ టీమ్ గత మంగళవారం రాత్రి ఇటలీకి బయల్దేరారట. రేపటి నుంచి షెడ్యూల్ ప్రకారం షూటింగ్ మొదలు కానుందట.  చాలా కాలం తరువాత ప్రభాస్ మళ్లీ షూటింగ్ లో పొల్గోనున్నాడు. ఇటలీలో రెండు వారాల పాటు చిత్రీకరణ జరగనుంది అని సమాచారం. పూజా హెగ్డే, ప్రభాస్ మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం.

షూటింగ్ పార్ట్ ముగించుకుని అక్టోబర్ చివరి వారంలో హైదరాబాద్ కు ( Hyderabad ) తిరిగి రానుంది యూనిట్. ఇక్కడికి వచ్చాక రెండు వారాల పాటు క్వారెంటైన్ లో ఉండనున్నారు. తరువాత షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. రాధేశ్యామ్ చిత్రాన్ని రాధా  కృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు.

ALSO READ : GRAND ICT Challegne: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ ఛాలెంజ్ పూర్తి చేస్తే.. రూ.50 లక్షలు మీకే సొంతం

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ చిత్రంతో పాటు మరో రెండు చిత్రాలకు కమిట్ అయ్యాడు. ఇందులో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఒక చిత్రం ఉంది. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా ఎంపికైంది. అదే సమయంలో టీ సిరీస్ నిర్మిస్తోన్న ఆదిపురుష్ చిత్రం కూడా ప్రీ ప్రొడక్షన్ లో ఉంది. 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News