Raj Tarun: ఆ హీరోయిన్‌తో రాజ్‌ తరుణ్ ఎఫైర్.. బాంబ్ పేల్చిన ప్రేయసి.

Raj Tarun Girlfriend: యంగ్ హీరో రాజ్ తరుణ్ మీద ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ప్రేమ పెళ్లి.. పేరుతో ఆమెను నమ్మించి మోసం చేశాడు అంటూ రాజ్ తరుణ్ తో పాటు.. అతని సోదరుడిపై కూడా ఆమె కేసు ఫైల్ చేసింది. 11 ఏళ్లుగా ఆమెతో ఉంటూ ఇప్పుడు మోసం చేశాడని ఆమె వాపోయింది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 5, 2024, 03:10 PM IST
Raj Tarun: ఆ హీరోయిన్‌తో రాజ్‌ తరుణ్ ఎఫైర్.. బాంబ్ పేల్చిన ప్రేయసి.

Raj Tarun Controversy: షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ పాపులర్ అయిన రాజ్ తరుణ్.. ఇప్పుడు హీరోగా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మీడియం బడ్జెట్ సినిమాలు చేస్తూ చాలా వరకు వినోదాత్మక సినిమాల్లోనే కనిపించే రాజ్ తరుణ్.. ఇప్పుడు వ్యక్తిగత జీవితం పరంగా ఒక పెద్ద సమస్యలోని ఇరుక్కున్నాడు. 

రాజ్ తరుణ్ ప్రేమికురాలు లావణ్య.. అతనికి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. తనని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడు అంటూ ఆమె ఆరోపించింది. రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఇప్పుడు వేరే అమ్మాయితో ఉంటున్నాడు.. అంటూ లావణ్య అనే అమ్మాయి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

అయితే ఆ మరొక అమ్మాయి ఎవరో కాదు రాజ్ తరుణ్ నెక్స్ట్ సినిమా హీరోయిన్ మాల్వీ మల్హోత్రా. లావణ్య ఇచ్చిన కంప్లయింట్ ప్రకారం 2012 ఆమె రాజ్ తరుణ్ ప్రేమించుకున్నారు. 2014 నుండి వాళ్ళు ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. అయితే ‘తిరగబడరా సామి’ షూటింగ్ సమయంలో రాజ్ తరుణ్ సినిమాలో హీరోయిన్ కి మాల్వీకి.. దగ్గరయ్యాడు అని, ఆమె హైదరాబాద్ వచ్చిన ప్రతి సారి సినిమా డైరెక్టర్.. రవి కుమార్ ఇంట్లో వాళ్ళిద్దరూ.. దొంగచాటుగా కలుసుకుంటున్నారు అని చెప్పింది. 

ఇద్దరు కలిసి గోవా, చెన్నై, పాండిచ్చేరి.. వెళ్లారని ఆ సమయంలో రాజ్ తరుణ్ ని నిలదీయగా.. అతను ఆమెను హింసించడం మొదలుపెట్టాడు అని చెప్పింది. రాజ్ తరుణ్ కాకుండా మాల్వీ, మాల్వీ తండ్రి కూడా ఆమెను టార్చర్ చేస్తున్నారు అని పేర్కొంది. రాజ్ తరుణ్ ని వదిలేయకపోతే.. ఆమెను చంపేస్తామని బెదిరిస్తున్నట్టు కేసు పెట్టింది. 

హిమాచల్ ప్రదేశ్ ముఖ్య మంత్రి కూడా మాల్వీ తండ్రి కి మంచి స్నేహితుడు అని, ఇన్ఫ్లుయెన్స్ వాడి వాళ్ళు తనని చంపడానికి.. ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆమె ఆరోపణ. అంతే కాకుండా వాళ్ళ నుండి తనకి ప్రాణ హాని ఉండడంతో ఆమెకు రక్షణ.. కూడా కల్పించాలి అని లావణ్య పోలీసులను ఆశ్రయించింది. మరి ఈ కేసు విషయంలో ఆ హీరో హీరోయిన్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Also Read: Pawan Kalyan: పవన్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఓజీపై అప్‌డేట్‌ ఇచ్చిన పవన్‌ కల్యాణ్

Also Read: Venu Swamy: బిగ్‌బాస్‌ షోలోకి వేణుస్వామి ఫిక్స్.. షో వ్యూస్‌ రికార్డులు బద్దలయ్యే అవకాశం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News