ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన రజినీ చిత్రం "బాషా"

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "బాషా" చిత్రం (డిజిటల్ వెర్షన్) అమెరికాలో ప్రారంభమయ్యే "ఫెంటాస్టిక్" చలన చిత్రోత్సవానికి ప్రత్యేక ప్రదర్శనగా ఎంపికయ్యింది. వైవిధ్యమైన కథనాలతో రూపొందే  వివిధ దేశాల చిత్రాలను ప్రదర్శించడం ఈ చలన చిత్రోత్సవం ప్రత్యేకత. హారర్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ అంశాలతో పాటు పలు  వైవిధ్యమైన కథలతో రూపొందిన సినిమాలను కూడా ఈ చిత్రోత్సవంలో ప్రదర్శిస్తారు. గత 12 సంవత్సరాలుగా  అమెరికాలో ఈ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత సంవత్సరం కూడా  మన దేశం నుండి కమల్ హాసన్ నటించిన "ఆళవందన్" చిత్రం ఈ చిత్రోత్సవానికి ఎంపికయ్యింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 21 నుండి 24వ తేదీ వరకు జరిగే ఈ చిత్రోత్సవంలో "బాషా" చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శనగా ఎంపిక చేయడం విశేషం. 

Last Updated : Sep 22, 2017, 04:09 PM IST
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన రజినీ చిత్రం "బాషా"

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "బాషా" చిత్రం (డిజిటల్ వెర్షన్) అమెరికాలో ప్రారంభమయ్యే "ఫెంటాస్టిక్" చలన చిత్రోత్సవానికి ప్రత్యేక ప్రదర్శనగా ఎంపికయ్యింది. వైవిధ్యమైన కథనాలతో రూపొందే  వివిధ దేశాల చిత్రాలను ప్రదర్శించడం ఈ చలన చిత్రోత్సవం ప్రత్యేకత. హారర్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ అంశాలతో పాటు పలు  వైవిధ్యమైన కథలతో రూపొందిన సినిమాలను కూడా ఈ చిత్రోత్సవంలో ప్రదర్శిస్తారు. గత 12 సంవత్సరాలుగా  అమెరికాలో ఈ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత సంవత్సరం కూడా  మన దేశం నుండి కమల్ హాసన్ నటించిన "ఆళవందన్" చిత్రం ఈ చిత్రోత్సవానికి ఎంపికయ్యింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 21 నుండి 24వ తేదీ వరకు జరిగే ఈ చిత్రోత్సవంలో "బాషా" చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శనగా ఎంపిక చేయడం విశేషం. 

1995లో విడుదలైన బాషా చిత్రం తెలుగుతో పాటు కొన్ని ఇతర భాషల్లో కూడా డబ్ అయ్యింది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో రజనీకాంత్, నగ్మా, రఘువరన్  ప్రధాన పాత్రల్లో  నటించిన ఈ చిత్రము అప్పట్లో  సంచలన విజయాన్ని సాధించింది. 2013లో  తెలుగు , తమిళ భాషలలో ఈ చిత్ర డిజిటల్ వెర్షన్ కూడా విడుదల అయ్యింది. 

Trending News