BulBul Tarang: రామారావు ఆన్​ డ్యూటీ తొలి పాట రిలీజ్​.. లిరిక్స్ అదుర్స్​

BulBul Tarang: రామారావు ఆన్​ డ్యూటీ సినిమా నుంచి తొలి లిరికల్​ సాంగ్ నేడు విడుదలైంది. రేకుండు మౌళి రాసిన ఈ పాటను.. సిద్ద్ శ్రీరామ్​ పాడారు. మ్యూజిక్​, పాట లిరిక్స్​ సూపర్ అంటున్నారు ఫ్యాన్స్​.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 10, 2022, 12:20 PM IST
  • రామారావు ఆన్​ డ్యూటీ నుంచి బిగ్ అప్​డేట్​
  • శ్రీరామనవమి సందర్భంగా లిరికల్ సాంగ్..
  • ఆకట్టుకుంటున్న బుల్​ బుల్ తరంగ్​ పాట లిరిక్స్​
BulBul Tarang: రామారావు ఆన్​ డ్యూటీ తొలి పాట రిలీజ్​.. లిరిక్స్ అదుర్స్​

BulBul Tarang: మాస్​ మహారాజ్​ రవితేజ హీరోగా నటిస్తున్న రామారావు ఆన్​ డ్యూటీ సినిమా నుంచి శ్రీరామ నవమి సందర్భంగా బిగ్​ అప్​డేట్ వచ్చింంది. సినిమా నుంచి ఫస్ట్​ లిరికల్​ సాంగ్​ను (బుల్​ బుల్ తరంగ్​) విడుదల చేసింది చిత్ర యూనిట్​.

'తూలె గిర గిరమని బుర్ర్రే ఇట్టా.. తేలిందె నెలవంటా అండుగుల వెంటా..' అంటూ సాగే ఈ పాటను సిద్​ శ్రీరామ్​ ఆలపించారు. శామ్​ సీ ఎస్​ మ్యూజిక్​.. సిద్ద్ శ్రీరామ్​ గొందులో మ్యాజిక్ ఈ పాటను మరోస్థాయికి తీసుకెళ్లాయని రవితేజ అభిమానులు అంటున్నారు. రేకుండు మౌళి రాసిన లిరిక్స్​ కొత్తగా.. మనసుకునే విధంగా ఉన్నయని చెబుతున్నారు.

సినిమా గురించి..

ఈ సినిమాలో రవితేజ సరసన మలయాళి ముద్దుగుమ్న రజిశా విజయన్​ హీరోయిన్​గా నటిస్తోంది. నాజర్​, పర్వాతి లోకేశ్​, తనికెళ్ల భరణి వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించున్నారు. రవితేజ డిప్యూటీ కలెక్టర్​గా కనిపించనున్నారు. పూర్తి స్థాయి యాక్షన్​, రవితేజ మార్క్ కామెడీ ఎంటర్​టైనర్​గా ఈ మూవీ తెరకెక్కుతోంది.

శరత్​ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయించింది. ప్రస్తుతం పోస్ట్​ ప్రొడక్షన్​ పనులు వేగంగా జరుపుకుంటోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్​, ఆర్​టీ టీమ్ వర్క్స్​ బ్యానర్లపై.. సుధాకర్ చెరుకూరి ఈ మూవికి నిర్మతగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే విడుదైన గ్లింప్స్, టీజర్స్​ మూవీపై పాజిటివ్ అంచనాలను పెంచుతున్నాయి. ఇక తాజాగా విడుదలైన సాంగ్​తో ఈ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఈ మూవీని జూన్​ 17న విడుదల చేయనాలని ఇప్పటికే చిత్ర యూనిట్​ నిర్ణయించింది.

Also read: Krithi Shetty: కవ్వించే చూపులతో కుర్రకారుకు మత్తెక్కిస్తోన్న ఉప్పెన బ్యూటీ...

Also read:Sonam Kapoor: హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ... రూ.2.4 కోట్ల విలువైన నగలు, నగదు మాయం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News