Rana Daggubati’s teaser: భీమ్లా నాయక్ మూవీ నుంచి రానా దగ్గుబాటి టీజర్ విడుదల ఆరోజేనా ?

Rana Daggubati’s teaser from Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ మూవీ నుంచి ఇటీవలే భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్సెకి పవర్ స్టార్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇంకా పడుతూనే ఉన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 14, 2021, 03:27 PM IST
  • పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో భీమ్లా నాయక్ మూవీ
  • భీమ్లా నాయక్ మూవీ ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ సాంగ్‌కి భారీ స్పందన
  • త్వరలోనే రానా దగ్గుబాటి టీజర్
Rana Daggubati’s teaser: భీమ్లా నాయక్ మూవీ నుంచి రానా దగ్గుబాటి టీజర్ విడుదల ఆరోజేనా ?

Rana Daggubati’s teaser from Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ మూవీ నుంచి ఇటీవలే భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్సెకి పవర్ స్టార్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇంకా పడుతూనే ఉన్నారు. ఈ ప్రోమో వీడియోలో రానా దగ్గుబాటి ప్రస్తావన లేకపోవడం రానా ఫ్యాన్స్‌ని ఒకింత నిరాశకు గురిచేసింది. 

తాజాగా ఫిలింనగర్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం రానా దగ్గుబాటి వెర్షన్ టీజర్‌ని సెప్టెంబర్ 17న విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమాలో రానా పోషించిన పాత్ర పేరు డానియెల్ శేఖర్ కాగా ఆ పాత్ర తీరు తెన్నులను పరిచయం చేస్తూ సెప్టెంబర్ 17న ఓ టీజర్ (Rana Daggubati in Bheemla Nayak movie) విడుదల కానున్నట్టు టాక్.

Also read : Samantha relationship: నాగచైతన్య Love story trailer ట్వీట్‌కి సమంత రిప్లై

సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. భీమ్లా నాయక్ సినిమాను (Bheemla Nayak movie) సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తుండగా.. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా భీమ్లా నాయక్ మూవీ విడుదల (Bheemla Nayak movie release date) కానుంది.

Also read : krishnam raju health condition: ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటుడు కృష్ణంరాజు! తన ఆరోగ్యం బాగానే ఉందన్న రెబల్ స్టార్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News