Samantha relationship: నాగచైతన్య Love story trailer ట్వీట్‌కి సమంత రిప్లై

Samantha's tweet on Love story trailer: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ మూవీ ట్రైలర్ కేవలం అభిమానులకే కాదు.. చైతూ లైఫ్ పార్టనర్ సమంతకు కూడా బాగా నచ్చింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 14, 2021, 11:33 AM IST
  • ఆసక్తిరేకెత్తిస్తున్న లవ్ స్టోరీ మూవీ ట్రైలర్
  • లవ్ స్టోరీ మూవీ ట్రైలర్‌పై స్పందించిన సమంత
  • సమంత ట్విట్‌పై కూడా సోషల్ మీడియాలో చర్చ
Samantha relationship: నాగచైతన్య Love story trailer ట్వీట్‌కి సమంత రిప్లై

Samantha's tweet on Love story trailer: లవ్ స్టోరీ ట్రైలర్ ఆడియెన్స్ ముందుకు రావడమే కాదు.. కేవలం 10 గంటల వ్యవధిలోనే 4 మిలియన్లకుపైగా వ్యూస్ రాబట్టి ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది కూడా. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ మూవీ ట్రైలర్ కేవలం అభిమానులకే కాదు.. చైతూ లైఫ్ పార్టనర్ సమంతకు కూడా బాగా నచ్చింది. అందుకే యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న లవ్ స్టోరీ ట్రైలర్‌‌ని చైతూ ట్వీట్ చేయగా.. సమంత ఆ ట్వీట్‌పై స్పందిస్తూ.. మూవీ ఆడియెన్స్ మది గెల్చుకుంటుందనే అర్థాన్నిస్తూ ''విన్నర్'' అని రిట్వీట్ చేసింది. అంతేకాకుండా లవ్ స్టోరీ మూవీ యూనిట్‌కి, నటి సాయి పల్లవికి (Sai Pallavi) ఆల్ ది బెస్ట్ చెప్పింది.

నాగచైతన్య చేసిన ట్వీట్‌కి సమంత రిప్లై ఇవ్వడం ఆమె అభిమానులు, అక్కినేని అభిమానులు స్పందిస్తూ.. చైతూ, సమంత మధ్య ఏ విభేదాలు లేవని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి అని చర్చించుకుంటున్నారు. మరోవైపు తాజాగా చైతూ (Naga Chaitanya) సైతం థాంక్యూ సామ్ అంటూ బదులిచ్చాడు. 

Also read : Akhil Akkineni: అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నుంచి అప్ డేట్..‘లెహరాయి’ సాంగ్ ప్రోమో విడుదల

సమంత తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పేరు చివరన ఉన్న సర్‌నేమ్ అక్కినేనిని తొలగించడంతో మొదలైన చర్చ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసింది. సమంత, చైతూ మధ్య రిలేషన్‌షిప్ స్టేటస్‌పై (Samantha relationship with Naga Chaitanya) పుంకానుపుంకాన్ల కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. 

అయితే, ఆ ఇద్దరి మధ్య ఏ గొడవ లేదని చెప్పడానికి తాజాగా వాళ్లిద్దరూ ఒకరికొకరు విష్ చేసుకుంటూ చేసిన ట్వీట్సే సాక్ష్యం అని అభిమానులు అనుకుంటున్నారు. అదే నిజమైతే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఏదేమైనా లవ్ స్టోరీ ట్రైలర్ (Love story trailer) వీళ్ల లవ్ స్టోరీ కొనసాగుతుందని చెప్పిందన్నమాట.

Also read : Upcoming Telugu Movies: ఈ వారం ఓటీటీలో థియేటర్‌లలో రిలీజ్‌ అయ్యే సినిమాలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News