Rashmika Cheated by her Manager: మేనేజర్ చేతిలో దారుణంగా మోసపోయిన రష్మిక.. గుడ్డిగా నమ్మితే రూ.80 లక్షలు మోసం!

Rashmika Mandanna Cheated by her Manager: రష్మిక మందనను మేనేజర్ నిండా ముంచాడు. ఆమెను దాదాపు రూ.80 లక్షలు మోసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అతడిని రష్మిక ఉద్యోగం నుంచి సాగనింపించినట్లు సమాచారం. ఎలాంటి పోలీసు కేసు పెట్టకుండా మౌనం వహించినట్లు ప్రచారం జరుగుతోంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 21, 2023, 06:11 PM IST
Rashmika Cheated by her Manager: మేనేజర్ చేతిలో దారుణంగా మోసపోయిన రష్మిక.. గుడ్డిగా నమ్మితే రూ.80 లక్షలు మోసం!

Rashmika Mandanna cheated by her Manager: ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో భారీ క్రేజ్ ఉన్న హీరోయిన్ రష్మిక మందన. నేషనల్‌ క్రష్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తక్కువ సినిమాలతో ఎక్కువ పేరు సంపాదించుకుంది ఈ భామ. ముఖ్యంగా పుష్ప సినిమాతో ఇండియా వైడ్‌గా ఓ రేంజ్‌లో స్టార్‌డమ్ ఏర్పడింది. ఈ దెబ్బతో బాలీవుడ్‌ నుంచి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న తరుణంలోనే రష్మికకు తన మేనేజర్‌ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రష్మిక వద్ద చాలారోజులు మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి దాదాపు రూ.80 లక్షలు మోసం చేసినట్లు తెలుస్తోంది. 

అతడిని ఉద్యోగం నుంచి తొలగించిన రష్మిక.. ఇక ఈ విషయాన్ని పెద్దది చేయకుండా సైలెంట్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రష్మిక కెరీర్ ఆరంభం నుంచే ఆర్థిక వ్యవహారాలు అన్ని అతనే చూసుకుంటున్నాడట. డబ్బులు పోయిన విషయంపై రష్మిక అధికారిక ప్రకటన గానీ.. పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి గానీ చేయలేదు.

రష్మిక చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2తో పాటు రణ్‌బీర్‌కపూర్‌, సందీప్‌ వంగా కాంబినేషన్‌లో వస్తున్న యానిమల్‌ చిత్రంలోనూ యాక్ట్ చేస్తోంది. ఆగస్ట్ 11న యానిమల్ మూవీ విడుదల కానుంది. అయితే అందరి కళ్లు మాత్రం పుష్ప-2పైనే ఉన్నాయి.

Also Read: Weather Updates: భారీ ఎండల నుంచి ఉపశమనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు

పుష్ప శ్రీవల్లిగా మెప్పించిన రష్మిక.. తన అందచందాలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ సరసన అదిరిపోయే స్టెప్పులు వేసి అలరించింది. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో పుష్ప-2పై ఓ రేంజ్‌లో అంచనాలు పెరిగిపోయాయి. రీసెంట్‌గా రిలీజ్ అయిన వీడియోతో ఎక్స్‌పెటేషన్స్ డబుల్ అయ్యాయి.

కన్నడలో కిర్రాక్ పార్టీ మూవీతో తెరంగేట్రం చేసిన రష్మిక. తెలుగులో ఛలో సినిమాతో అడుగుపెట్టింది. తొలి సినిమానే హిట్ అవ్వగా.. ఆ తరువాత గీత గోవిందం మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. డియర్ కామ్రేడ్ సినిమా నిరాశపరిచినా.. మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాతో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. పుష్ప ది రూల్‌లో పాన్‌ ఇండియాల్లో బోణీ కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగుతోపాటు హిందీలోనూ నేషనల్ క్రష్ ఫుల్ బిజీగా ఉంటోంది.

Also Read: Bandi Sanjay: పీఆర్‌సీకి ఏర్పాటుకు బండి సంజయ్ రిక్వెస్ట్.. సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News