Ravi Teja - Eagle: అక్కడ నెంబర్ వన్ ట్రెండింగ్‌లో రవితేజ 'ఈగల్' మూవీ..

Ravi Teja - Eagle Movie: మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్‌గా 'ఈగల్‌' మూవీతో పలకరించాడు. గత నెల 9న విడుదలైన ఈ సినిమా మంచి టాకే తెచ్చుకుంది. కానీ అందుకు తగ్గ వసూళ్లను రాబట్టడంలో విఫలమైంది. థియేట్రికల్ రన్  ముగిసిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 4, 2024, 10:44 AM IST
Ravi Teja - Eagle: అక్కడ నెంబర్ వన్ ట్రెండింగ్‌లో రవితేజ 'ఈగల్' మూవీ..

Ravi Teja - Eagle Movie:మాస్ మహారాజ్ రవితేజ హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. గత నెల 'ఈగల్' మూవీతో పలకరించాడు రవితేజ. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ ఎత్తున నిర్మించింది.సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా తీవ్ర పోటీ కారణంగా ఫిబ్రవరి 9న విడుదలైంది.
ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే మంచి టాక్‌ సంపాదించుకుంది. కానీ అందుకు తగ్గ వసూళ్లను రాబట్టడంలో విఫలమైంది. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ప్రైమ్ వీడియోలో ఈ సినిమా నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులు దాదాపు రూ. 10 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ రేటుకే అమ్ముడుపోయింది.

మాస్ మహారాజ్ రవితేజ విషయానికొస్తే.. లాస్ట్ ఇయర్ వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో పలకరించారు. అందులో చిరంజీవి  తమ్ముడిగా నటించిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయినా.. ఆ క్రెడిట్ మొత్తం చిరు ఖాతాలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈయన నుంచి వచ్చిన సినిమాలేవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి.  తాజాగా రవితేజ 'ఈగల్‌' మూవీతో పలకరించాడు.

ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ విషయానికొస్తే.. తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ. 14 కోట్ల షేర్ (రూ. 25 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్ల షేర్ (రూ. 36 కోట్ల గ్రాస్) వసూళ్లకు రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 3 కోట్ల థియేట్రికల్ నష్టాలను మిగిల్చింది.

ఇక రవితేజ నటించిన 'ఈగల్' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..

తెలంగాణ (నైజాం).. రూ. 6 కోట్లు..
రాయలసీమ (సీడెడ్).. రూ. 2.5 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్.. రూ. 8.5 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి .. రూ. 17 కోట్లు..
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 2 కోట్లు..
ఓవర్సీస్.. రూ. 2 కోట్లు..
ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే .. బాక్సాఫీస్ దగ్గర రూ. 22 కోట్లు రాబడితే కానీ.. హిట్ అనిపించుకోదు. కానీ ఇప్పటికీ ఈ మూవీ రూ. 3 కోట్ల దూరంలో ఉండిపోయింది.

'ఈగల్' మూవీ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరోగా రవితేజతో పాటు అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ముఖ్యపాత్రల్లో నటించారు.ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. దాంతో పాటు రచన, ఎడిటింగ్  నిర్వహించారు. సంగీతం దావ్జాంద్ అందించారు. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల భారీ ఎత్తున లావిష్‌గా నిర్మించారు.రవితేజ సినిమాల విషయానికొస్తే.. క్రాక్ తర్వాత మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పవర్ఫుల్  సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేసారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. అటు హరీష్ శంకర్ దర్శకత్వంలో హిందీ రీమేక్ 'రెయిడ్' మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి 'మిస్టర్ బచ్చన్' అనే టైటిల్ ఖరారు చేసారు. గతంలో వీళ్ల కాంబినేషన్‌లో షాక్, మిరపకాయ్ సినిమాలు వచ్చాయి. ఇపుడు రాబోతున్న 'మిస్టర్ బచ్చన్‌' మూవీ పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలే ఉన్నాయి.

Also read: Ycp vs Prashant kishor: ఎన్ని పీకేలొచ్చినా పీకేదేం లేదు, ప్రశాంత్ కిశోర్‌పై మండిపడుతున్న వైసీపీ నేతలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x