Record Break: తెలుగులో ఇప్పటి వరకు రానటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న పాన్ ఇండియా మూవీ 'రికార్డ్ బ్రేక్'..

Record Break: తెలుగులో ఇప్పటి వరకు పలు డిఫరెంట్ కాన్సెస్ట్ చిత్రాలు వచ్చాయి. వాటిని ప్రేక్షకులు ఆదరించారు. ఈ కోవలో ప్రముఖ నిర్మాత, దర్శకుడు చదలవాడ శ్రీనివాస రావు తెరకెక్కించిన మూవీ 'రికార్డ్ బ్రేక్'. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 8, 2024, 06:40 AM IST
Record Break: తెలుగులో ఇప్పటి వరకు రానటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న పాన్ ఇండియా మూవీ 'రికార్డ్ బ్రేక్'..

Record Break: మహాశివరాత్రి సందర్భంగా పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. చదలవాడ శ్రీనివాస  రావు డైరెక్ట్ చేస్తూ నిర్మించారు. ఈ సినిమాలో  నిహార్ కపూర్, యాక్టర్ నాగార్జున, సత్య కృష్ణ, టి. ప్రసన్నకుమార్, రగ్ధా ఇఫ్తాకర్, సంజన, శాంతి తివారి, సోనియా, కాశీ విశ్వనాథ్  లీడ్ రోల్లో యాక్ట్ చేశారు.   శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి, చదలవాడ శ్రీనివాసరావు నిర్మించారు. చాలా గ్రాండియర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి కథ అంగిరెడ్డి శ్రీనివాస్ అందించారు. డిఓపిగా కంతేటి శంకర్ మరియు సాబు వర్గీస్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకు వేసిన ప్రీమియర్ షోలకు మంచి స్పందన లభించింది.  మహా శివరాత్రి కానుకగా ఈ సినిమాను  ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు.

ఈ సందర్భంగా దర్శక, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు  మాట్లాడుతూ :

ఐదేళ్ల కష్టపడి ఇష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాను.ఈ ఫలితంపై ఎంత ఎగ్జైటింగ్‌గా ఉన్నాము. తన కెరీర్లో ఎన్ని  సినిమాలు నిర్మించిన ఏ సినిమాను ప్రమోట్ చేయమని అడగలేదు. కానీ ఇలాంటి సినిమాలకు ప్రమోషన్ కంపల్సరీ.  ఒక మంచి సందేశం ఉన్న సినిమా. మార్నింగ్ షో ఓపెనింగ్స్ మంచిగా వస్తే ఈవినింగ్ కల్లా సినిమా కచ్చితంగా రన్ అందుకుంటుంటి. మార్నింగ్ షో కి వచ్చి చూడండి సినిమా బాగోకపోతే ఎవరూ రావద్దు బాగుంటే మటుకు ఖచ్చితంగా సినిమా ని సపోర్ట్ చేయాలనేదే నా విజ్ఞప్తి.  హీరో, హీరయిన్ అని కాకుండా ఒక మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ఒక గొప్ప సినిమా తీసానన్న గర్వంగా చెప్పగలను. ఇటువంటి సినిమాలను ఆదరిస్తే నాలాంటి ఎంతో మంది దర్శకులు ఇండస్ట్రీ కి వస్తారన్నారు. ఆ సందర్భంగా చిత్ర నిర్మాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ..
కరోనా కాలంలో పేస్టింగ్ బాయ్స్ దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కష్టంలో ఉన్న అందరిని ఆదుకున్న వ్యక్తి చదలవాడ శ్రీనివాసరావు . మనం ఎదుటివారికి సేవ చేస్తే దేవుడు మనకు పదింతలు అంతకు మించి అందిస్తారు. రికార్డ్ బ్రేక్ ఖచ్చితంగా హిట్ అవుతుంది. ప్రేక్షకుల ఇలాంటి సినిమాలను తప్పకుండా ఆదరిస్తాన్న నమ్మకం ఉందన్నారు. ఇందులో బడా ఆర్టిస్టులు ఎవరూ లేకపోయినా క్యారెక్టర్లు కనబడాలి అని నమ్మిన వ్యక్తి. ఒక మంచి సబ్జెక్ట్ ఎంచుకుని ఈ సినిమా తీశారు. ప్రతి భారతీయుడు గర్వించే సినిమా రికార్డ్ బ్రేక్. ఇద్దరు అనాధలు వరల్డ్ రెజ్లింగ్ వరకు ఎలా వెళ్లారు అనే కాన్సెప్ట్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఈ సినిమా చేయడం చాలా రిస్క్ అయినా కూడా ఆయన సాహసంతో ఈ సినిమాని నిర్మించారు.  

నిహార్ కపూర్ మాట్లాడుతూ :
ఈ సినిమా కోసం మేం ఎంతో కష్టపడి కాదు..ఇష్టపడి చేసాము. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ చాలా బాగా వచ్చింది. మంచి దేశభక్తితో కూడిన సినిమా. ప్రేక్షకులు ఈ సినిమా చూసి సరికొత్తగా ఫీలవుతారు. ఈ సినిమాలో దేశభక్తి, మదర్ సెంటిమెంట్, డివోషన్, రైతుల కష్టం అన్ని అంశాలను టచ్ చేసాము. థియేటర్స్‌లో ప్రేక్షకులు ఎంజాయ చేస్తారనే నమ్మకం ఉందన్నారు. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా.

. Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News