Tollywood movies reschedule: రిలీజ్ డేట్స్ క్రాష్..విడుదల తేదీలు మార్చుకుంటున్న నిర్మాతలు

Tollywood movies reschedule: టాలీవుడ్ నిర్మాతలు ముందూ వెనుకా చూడకుండా విడుదల తేదీలు ప్రకటించేసుకున్నారు. ఒకదానికొకటి క్రాష్ అవుతుండటంతో చేసిన పొరపాటు గుర్తొచ్చింది. ఇప్పుడు మార్చుకునే పనిలో పడ్డారు.

Last Updated : Feb 2, 2021, 11:08 PM IST
Tollywood movies reschedule: రిలీజ్ డేట్స్ క్రాష్..విడుదల తేదీలు మార్చుకుంటున్న నిర్మాతలు

Tollywood movies reschedule: టాలీవుడ్ నిర్మాతలు ముందూ వెనుకా చూడకుండా విడుదల తేదీలు ప్రకటించేసుకున్నారు. ఒకదానికొకటి క్రాష్ అవుతుండటంతో చేసిన పొరపాటు గుర్తొచ్చింది. ఇప్పుడు మార్చుకునే పనిలో పడ్డారు.

తెలుగు చలన చిత్ర ( Tollywood ) పరిశ్రమలో కేవలం 4-5 రోజుల్లోనే 25కు పైగా సినిమాల విడుదల తేదీలు ఖరారయ్యాయి. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు..మరికొన్ని చిన్న సినిమాలు. రిలీజ్ డేట్స్ క్రాష్ అవుతున్నాయా లేదా అనేది చూడకుండా ప్రకటించేశారు. ఊహించిందే అయింది. సినిమా రిలీజ్ డేట్స్ ( Movie release dates ) ఒకదానికొకటి క్రాష్ అయ్యాయి. ఇదే కొనసాగితే వసూళ్లు దారుణంగా పడిపోతాయి. నిర్మాతల సంగతేమో గానీ..బయ్యర్లకు భారీ నష్టం కలుగుతుంది. అందుకే కుదరదని చెప్పేశారు. చేసేది లేక దర్శక నిర్మాతలు డేట్స్ మారుస్తున్నారిప్పుడు. 

ముఖ్యంగా నాని ( Nani ), వెంకటేశ్ ( Venkatesh ), గోపీచంద్ ( Gopichand ) హీరోల సినిమా తేదీల్నిమార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏప్రిల్ 16న టక్ జగదీష్ విడుదల కావల్సి ఉంది. అయితే అదేరోజు నాగ్ చైత్యన, సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ విడుదల కానుంది. దాంతో టక్ జగదీష్ సినిమా విడుదలను వారం రోజులపాటు అంటే ఏప్రిల్ 23వ తేదీకు వాయిదా వేశారు. ఇక ఏప్రిల్ 2వ తేదీన విడుదల కావల్సిన గోపీచంద్ నటించిన సీటీమార్ సినిమా..ఏప్రిల్ 30వ తేదీన రావల్సిన విరాటపర్వం రిలీజ్ డేట్స్ మారనున్నాయి. మరోవైపు వెంకటేశ్ నటించిన నారప్ప..మే 14న విడుదల కావల్సి ఉంది. ఈ సినిమా కూడా వాయిదా పడనుందని తెలుస్తోంది. దీనికి కారణం ఏప్రిల్ 13వ తేదీన మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) నటించిన ఆచార్య ( Acharya movie ) విడుదల కానుంది. మెగాస్టార్ సినిమా కావడంతో పోటీ పడేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా లేరు. దాంతో చాలా సినిమాల రిలీజింగ్ డేట్స్..రీ షెడ్యూల్ అవుతున్నాయి. 

Also read: Kriti sanon red lips: రెడ్ లిప్స్..రెడ్ వేర్‌తో పిచ్చెక్కిస్తున్న కృతి సనన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News