Powerstar Trailer Review: ఈ చిత్రం ప్రవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కే అంకితం

Powerstar Trailer: పవన్ కళ్యాణ్ ఎన్నికల ఓటమి తరువాత తన ఫామ్‌హౌజ్‌లో ( Pawan Kalyan Farm House ) ఎక్కువగా గడపడం గురించి రామ్ గోపాల్ వర్మ ఫోకస్ పెట్టాడు. అచ్చం పవన్ కళ్యాణ్‌లా, చంద్రబాబులా ఉండే క్యారెక్టర్స్‌ను వెతికిపట్టుకున్నాడు వర్మ.

Last Updated : Jul 22, 2020, 12:28 PM IST
Powerstar Trailer Review: ఈ చిత్రం ప్రవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కే అంకితం

Powerstar Trailer Review: లాక్‌డౌన్‌ ( Lockdown) , కరోనావైరస్ ( Coronavirus ) సమయంలో బడా దర్శకనిర్మాతలు ఇంటికే పరిమితం అయిన సమయంలో రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma )  నగ్నం ( Nagnam ) , థ్రిల్లర్ , మర్డర్ అంటూ వరుసగా సినిమాలు ప్రకటించాడు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పవర్ స్టార్ అనే సినిమా తీస్తున్నా అని ప్రకటించాడు. పవర్ స్టార్ ట్రైలర్ ( Powerstar Trailer ) విడుదల చేసి చూడాలంటే రూ.25 ఖర్చు చేయాలి అన్నాడు. అయితే ఎవరో లీక్ చేశారు అని సారీ చెప్పి తన అఫీషియల్ యూ ట్యూబ్ ఖాతాలో షేర్ చేశాడు వర్మ. అయితే నిజంగా ఎవరైనా లీక్ చేశారా.. లేక ఎవరూ చూడలేకపోవడంతో గత్యంతరం లేక ఇలా విడుదల చేశాడా అనేది వర్మకే తెలియాలి. (.Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ )

పవన్ కళ్యాణ్ ఎన్నికల ఓటమి తరువాత తన ఫామ్‌హౌజ్‌లో ( Pawan Kalyan Farm House ) ఎక్కువగా గడపడం గురించి రామ్ గోపాల్ వర్మ ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. అచ్చం పవన్ కళ్యాణ్‌లా, చంద్రబాబులా ఉండే క్యారెక్టర్స్‌ను వెతికిపట్టుకున్నాడు వర్మ.

ట్రైరల్ ప్రారంభంలోనే ఎన్నికల ఫలితాలు వచ్చిన రాత్రి సీన్ చూపిస్తాడు. టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ పవర్ స్టార్ డూప్ టెన్షన్ పడటాన్ని వర్మ హైలైట్ చేస్తాడు. ఒక్క సీటు వచ్చింది ...అది కూడా మీకు రాలేదు అని తెలిశాక పవన్ కళ్యాణ్ రియాక్షన్‌ చూపించాడు రామ్ గోపాల్ వర్మ. ఈ ట్రైరల్‌లో చిరంజీవి, బండ్ల  గణేష్, చంద్రబాబు నాయుడు డూప్‌ క్యారెక్టర్స్‌ను కూడా పరిచయం చేశాడు.

పవన్ కళ్యాణ్ ఎన్నికల వైఫల్యం గురించి ఫోకస్ పెట్టిన వర్మ ఇతర పాత్రల రియాక్షన్స్‌ను చూపించడానికి ప్రయత్నించాడు. పవన్ కళ్యాణ్‌ డూప్‌తో చిరంజీవి డూప్‌ " నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పరా.. నువ్ పవర్ స్టార్ అయింది కానిస్టేబుల్ కొడుకుగానా.. లేక నా తమ్ముడిగానా అని అడుగుతాడు.

అదే విధంగా చంద్రబాబు నాయుడు డూప్‌తో " మిమ్మల్ని నమ్మోద్దు నమ్మోద్దు అని చాలా మంది చెప్పారు. మీకో దండం సామీ... వెళ్లండి"  అంటూ బయటికి వెళ్లమంటాడు.

దాంతో పాటు కత్తిమహేష్ ( ఒరిజినల్ క్యారెక్టర్ ) పవన్ కళ్యాణ్ డూప్‌ను ఇంటర్వ్యూ చేయడం అనేది పూర్తిగా కల్పితమే. ఈ ట్రైలర్ పవన్ కళ్యాణ్ అభిమాలకు ఏ మాత్రం నచ్చడం లేదని సమాచారం. ఇది కేవలం పవన్ కళ్యాణ్ డూప్ క్యారెక్టర్‌లా ఉంది అని అస్సలు బాగోలేదు అని.. నిజంగా ఇది డూప్ క్యారెక్టర్ చేసిన ప్రవన్ కళ్యాణ్ ( Prawan Kalyan ), వర్మకే నచ్చతుంది అని.. అందుకే వారికే అంకితం అని అంటున్నారు. ఇలా పవన్ కళ్యాణ్‌ను పూర్తిగా టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ పవన్ ఫ్యాన్స్‌ను ఉడికించి మరీ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఈ మూవీని జూలై 25న విడుదల చేయనున్నారు.

Nagnam Sweety Facts: నగ్నం స్వీటీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు 

అందాల నాగిని Mouni Roy Hot Photo Gallery

Follow us on twitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x