Salaar Collections: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. ప్రీ బుకింగ్స్ నుంచే సునామీ క్రియేట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్‍ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ చిత్రం మొదటి రోజు ఆన్లైన్ బుకింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎన్నో సెంటర్స్ లో ఎన్నో థియేటర్స్ లో.. విడుదలైన నిమిషాల్లోనే టికెట్లు అన్నీ బుక్ అయిపోయాయి. మొదట మార్నింగ్ షో నుంచి రాత్రి సెకండ్ షో వరకు ఒక్క షోకి కూడా టికెట్లు ఖాళీ లేకుండా నిమిషాల్లోనే ఫీల్ అయిపోయాయి. ఇక చిత్రం కి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో శనివారం, ఆదివారం టికెట్లు కూడా ముందుగానే ఆన్లైన్లో బుక్ అవుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్స్ గురించి అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు దాదాపు ఇండియాలోనే 100 కోట్ల నుంచి 110 కోట్లు వసూలు సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇక యుఎస్ లో 40 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని మొత్తం పైన మొదటి రోజే ఈ చిత్రం 150 నుంచి 160 కోట్లు సంపాదించిందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి
కాగా ఈ చిత్రానికి పోటీగా వచ్చిన షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ మూవీ గురువారమే (డిసెంబర్ 21) థియేటర్లలో రిలీజ్ అయింది. స్టార్ డైరెక్టర్ రాజ్‍కుమార్ హిరానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకంతో సలార్ చిత్రంతో పోటీకి దింపారు ఆ చిత్రం మేకర్స్. కానీ డంకీ చిత్రానికి తొలి రోజున ఇండియాలో రూ.30కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. దీంతో, ఇండియాలో తొలి రోజు నెట్ కలెక్షన్ల విషయంలో డంకీతో పోలిస్తే సలార్ మూడు రెట్లు అధికంగా దూసుకుపోయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. షారుఖ్ హీరోగా ఈ ఏడాది వచ్చిన పఠాన్, జవాన్ కంటే డంకీకి తొలి రోజు చాలా తక్కువగా వసూళ్లు వచ్చాయి. కాగా ప్రభాస్ గత రెండు చిత్రాలు డిజాస్టర్లు అయినా సలార్ చిత్రం మాత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ వైపు దూసుకెళ్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Also Read: Free Bus Ticket: ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం.. వాళ్లు టిక్కెట్ కొనాల్సిందే.. కొత్త రూల్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook