Update On "Salaar' Movie: 'ఆదిపురుష్' ముగిసింది.. ఆశలన్నీ 'సలార్‌' పైనే.. ఆగస్టు 15నే టీజర్ విడుదల

Update on Prabhas Salaar: ఆదిపురుష్ సినిమా క్రేజ్ కాస్తా ముగిసింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ప్రభాస్ అభిమానులు తీవ్రనిరాశలో మునిగిపోయారు. రాధేశ్యామ్ తరువాత వరుసగా రెండవ డిజాస్టర్ కాగలదని తెలుస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 20, 2023, 07:31 PM IST
Update On "Salaar' Movie: 'ఆదిపురుష్' ముగిసింది.. ఆశలన్నీ 'సలార్‌' పైనే.. ఆగస్టు 15నే టీజర్ విడుదల

Update on Prabhas Salaar Movie: ఎన్నో అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న విడుదలైన ఆదిపురుష్ సినిమా చుట్టూ వివాదం రేగుతోంది. మరోవైపు కలెక్షన్లపరంగా దూసుకుపోతున్నా సినిమా మాత్రం ఫ్లాప్‌టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ కెరీర్‌లో వరుసగా రెండవ డిజాస్టర్ అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ప్రభాస్ కెరీర్‌ను టర్న్ చేసే సినిమా ఏదిప్పుడు..

ఆదిపురుష్ సినిమా చూసినవాళ్లలో మెజార్టీ ఫ్లాప్ అనే చెబుతున్నారు. మూడు గంటలు థియేటర్‌లో కూర్చోవడం కష్టమంటున్నారు. సినిమాలో ల్యాగ్ ఎక్కువగా ఉందని, ప్రభాస్ కెరీర్‌ను దర్శకుడు ఓం రౌత్ పణంగా పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. మూడురోజుల వరకూ చాలా ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్ నడవడం, అభిమానుల ప్రభావం ఉండటం వల్ల కలెక్షన్లు బాగానే ఉండవచ్చు.

అందుకే నాలుగవ రోజు నుంచి సినిమా హిట్ లేదా ఫట్ అనేది తేలనుంది. ప్రేక్షకులు సినిమాను ఏ మేరకు ఆదరిస్తారనేది జూన్ 19, 20 తేదీల నుంచి వచ్చే ఫ్లోని బట్టి చెప్పవచ్చు. మొత్తానికి రాధేశ్యామ్ తరువాత ప్రభాస్ కెరీర్‌లో వరుసగా రెండవ డిజాస్టర్ అనే చెబుతున్నారంతా. వాస్తవానికి బాహుబలి తరువాత ప్రభాస్ కెరీర్‌లో హిట్ మూవీ లేనేలేదు. 

Also Read: Rashmika Mandanna: మేనేజర్ చేతిలో దారుణంగా మోసపోయిన రష్మిక.. గుడ్డిగా నమ్మితే చివరికి..!

బాహుబలి తరువాత విడుదలైన సాహో తెలుగులో డిజాస్టర్ అయినా హిందీలో రాణించడంతో ప్రభాస్ కెరీర్‌కు కాస్త ఫరవాలేదన్పించింది. కానీ రాధేశ్యామ్ డిజాస్టర్ అవడం, ఆ తరువాత ఇప్పుడు ఆదిపురుష్ కూడా అదే దిశగా ఉండటంతో ప్రభాస్ కెరీర్‌పైనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అందుకే అటు ప్రభాస్‌కు గానీ ఇటు ప్రభాస్ అభిమానులకు గానీ ఆశలన్నీ సలార్ సినిమాపైనే ఉన్నాయి. బ్లాక్ బస్టర్ మూవీ సిరీస్ కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సృష్టికర్త ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ దాదాపుగా పూర్తయింది. ఇప్పుడీ సినిమా హిట్ అయితేనే ప్రభాస్ క్రేజ్ కొనసాగుతుంది. లేదంటే ప్రభాస్ క్రేజ్ పడిపోయే ప్రమాదం లేకపోలేదు. 

ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమా రెండు భాగాల్లో రానుంది. ప్రభాస్ ఈ సినిమాలో అత్యంత శక్తివంతమైన పాత్రలో కన్పించనున్నాడు. సలార్ సినిమా టీజర్‌ను ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుని విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఇండిపెండెన్స్ డే అయితే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందనేది సలార్ చిత్ర యూనిట్ నమ్మకం. ప్రపంచవ్యాప్తంగా సలార్ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన ఐదు భాషల్లో విడుదల కానుంది. టీజర్ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు మరింత పెరగవచ్చు.

హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించింది. సినిమా ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటోంది. టీజర్ చాలా విభిన్నంగా ఉండేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. టీజర్ ఎంత హిట్టయితే సినిమా ప్రమోషన్‌కు అంత దోహదపడుతుంది. కేజీఎఫ్ రెండు భాగాల్ని ఒకదాన్ని మించిన మరొక హిట్ చేసిన ప్రశాంత్ నీల్ తన సామర్ధ్యాన్ని రుజువు చేసుకున్నాడు. అయితే వరుస రెండు ఫ్లాప్‌లతో ఉన్న ప్రభాస్ కెరీర్ తిరిగి గాడిన పడాలంటే సలార్ హిట్ కొట్టాల్సిందే.

Also Read: Adipurush Row: ఆదిపురుష్ చుట్టూ వివాదం, వచ్చే వారం నుంచి సినిమాలో కొత్త డైలాగ్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News