Prabhas Salaar: మోకాలి సర్జరీ కోసం విదేశాలకు ప్రభాస్...! ఆగిన సలార్ షూటింగ్...

Prabhas Salaar Updates: రెబల్ స్టార్ ప్రభాస్ అప్‌కమింగ్ మూవీ 'సలార్' షూటింగ్ ఆగిపోయింది. ప్రభాస్ మోకాలి సర్జరీ కోసం విదేశాలకు వెళ్లడంతో ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2022, 02:26 PM IST
  • సలార్ షూటింగ్‌కి బ్రేక్
  • మోకాలి సర్జరీ కోసం విదేశాలకు ప్రభాస్
  • కోలుకునేందుకు రెండు నెలలు పట్టే అవకాశం
  • అప్పటివరకూ షూటింగ్‌కి బ్రేక్ అని ప్రచారం
Prabhas Salaar: మోకాలి సర్జరీ కోసం విదేశాలకు ప్రభాస్...! ఆగిన సలార్ షూటింగ్...

Prabhas Salaar Updates: రెబల్ స్టార్ ప్రభాస్ అప్‌కమింగ్ మూవీ 'సలార్' షూటింగ్ ఆగిపోయింది. ప్రభాస్ మోకాలి సర్జరీ కోసం విదేశాలకు వెళ్లడంతో ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. సర్జరీ తర్వాత ప్రభాస్ పూర్తిగా కోలుకునేందుకు ఎంత లేదన్నా రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకూ సలార్ షూటింగ్‌కి బ్రేక్ పడినట్లేనని ప్రచారం జరుగుతోంది. 

ఇప్పటివరకూ సలార్ మూవీ కేవలం 60 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయింది. వచ్చే ఏడాది సలార్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నప్పటికీ.. అనుకోని గ్యాప్ కారణంగా సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదు. రాధేశ్యామ్ అంతగా కిక్ ఇవ్వకపోవడంతో... ప్రభాస్ ఎంటర్టైనర్ సలార్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

కాగా, దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 

Also read:Sri Lanka crisis: శ్రీలంకలో ముదురుతున్న సంక్షోభం- రోజుకు 10 గంటలు కరెంట్ కట్​!

Also read: Shanghai lockdown: చైనాలో కొవిడ్ భయాలు- నిర్బందంలో షాంఘై ప్రజలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News