Samantha’s Performance in Shaakuntalam: సమంత హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా రూపొందింది. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంధాన్ని ఆధారంగా చేసుకుని గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో శకుంతలా దుష్యంతుల ప్రేమ కథను హృద్యంగా చెప్పబోతున్నామని ముందు నుంచి ప్రచారం చేసినా ఎందుకో సినిమా మాత్రం ప్రేక్షకులకు కలెక్ట్ కాలేక పోయింది.
నిజానికి సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ ఈ సినిమా ధియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో మాత్రం పూర్తిస్థాయిలో విఫలమైంది. అయితే ఈ మధ్యనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే దీన్ని డిజిటల్ వేదికగా చూసిన అభిమానులు సైతం సమంత ఈ సినిమాలో తన పాత్రకు 100% న్యాయం చేయలేదని అంటున్నారు.
Also Read: Salaar Release Date:సలార్ రిలీజ్ డేట్ టెన్షన్.. అసలు విషయం చెప్పేసిన టీం!
ఆమె కనిపించిన చాలా సీన్స్ లో ఆమె పర్ఫామెన్స్ చాలా ఆర్డినరీగా ఉందని ముఖ్యంగా ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా వింతగా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. అలాగే హీరో సెలక్షన్ కూడా చాలా దరిద్రంగా ఉందని వారి మధ్య కెమిస్ట్రీ కూడా ఏ మాత్రం వర్కౌట్ కాలేదని అంటున్నారు. మొత్తం మీద థియేటర్ల ప్రేక్షకులు మాత్రమే కాదు ఓటీటీ ప్రేక్షకులు సైతం ఈ సినిమాని ఏ మాత్రం ఆదరించడం లేదు.
సమంత బ్యాడ్ పెర్ఫార్మెన్స్ సినిమాకి చేసిన బ్యాడ్ స్క్రీన్ ప్లే తప్పుడు క్యాస్టింగ్ మొత్తం కలిపి శాకుంతలం సినిమాకి భారీ నష్టాన్ని చేకూర్చాయని వారంతా భావిస్తున్నారు. సినిమా మొత్తానికి ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే అది కేవలం అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ మాత్రమే. ఆమె కనిపించినంత సేపు స్క్రీన్ మీద ఏదో తెలియని ఎనర్జీ ఉంటుంది. కానీ మిగతా ఏ సీన్ కూడా పెద్దగా ఎక్సైట్ చేసే పరిస్థితి లేదు. ఇక పూర్తి స్థాయిలో ఈ సినిమా మాత్రం అటు నిర్మాతలకు సినిమా కొనుక్కున్న వారికి భారీ నష్టాలు చేకూర్చిందని చెప్పక తప్పదు.
Also Read: Sunisith: చరణ్ ఫాన్స్ చేతుల్లో చావు దెబ్బలు తిన్న సునిషిత్ మమూలోడేమీ కాదు..ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook