Sanjay Dutt in Mahesh Babu film: మహేష్ బాబు సినిమాలో సంజయ్ దత్ విలనిజం ?

Sanjay Dutt in Mahesh Babu film: కేజీఎఫ్ 2 సినిమాలో అధిర పాత్ర ద్వారా తొలిసారిగా ఓ దక్షిణాది సినిమాకు సైన్ చేసిన సంజయ్ దత్ తాజాగా మహేష్ బాబు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అంటే టాలీవుడ్ వర్గాలు అవుననే అంటున్నాయి.

Written by - Pavan | Last Updated : Sep 8, 2021, 01:36 PM IST
  • KGF 2 సినిమాతో తొలిసారి స్ట్రెయిట్ సౌతిండియన్ సినిమాకు సైన్ చేసిన సంజయ్ దత్.
  • తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు సైన్ చేశాడా ?
  • మహేష్ బాబు సినిమాలో సంజయ్ దత్ పోషించబోయే పాత్ర ఇదేనా ?
Sanjay Dutt in Mahesh Babu film: మహేష్ బాబు సినిమాలో సంజయ్ దత్ విలనిజం ?

Sanjay Dutt in Mahesh Babu film: మహేష్ బాబు సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ నటిస్తున్నాడా ? కేజీఎఫ్ 2 సినిమాలో అధిర పాత్ర ద్వారా తొలిసారిగా ఓ దక్షిణాది సినిమాకు సైన్ చేసిన సంజయ్ దత్ తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అంటే టాలీవుడ్ వర్గాలు అవుననే అంటున్నాయి. మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా లాంటి చిత్రాల తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇది.

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో సినిమా అంటే అభిమానుల్లోనే కాదు.. సాధారణ ఆడియెన్స్‌లోనూ భారీ అంచనాలే ఉంటాయి. అందుకు కారణం ఆ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు (Athadu, Khaleja) భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు హిలేరియస్ కామెడిని కూడా అందించడమే. 

ఇదిలావుండగానే, తాజాగా మహేష్ బాబు సినిమాలో మరో కీలక పాత్ర కోసం సంజయ్ దత్‌ని ఎంపిక చేసుకున్నట్టు ఫిలింనగర్ టాక్. దీంతో మహేష్ బాబు సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. ఈ సినిమాలో సంజయ్ దత్ (Sanjay Dutt) ఓ రాజకీయ నేతగా విలన్ పాత్ర పోషించనున్నట్టు ఫిలింనగర్ టాక్.

Also read : Ram Charan's RC15 launch: రామ్‌చరణ్‌ ఆర్‌సీ 15 షురూ.. క్లాప్‌ కొట్టిన మెగాస్టార్ అతిథులుగా రాజ‌మౌళి,ర‌ణ్‌వీర్ సింగ్

త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ''అతడే పార్థు'', ''పార్థు'' అనే టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారు. విచిత్రం ఏంటంటే.. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు సినిమాలో మహేష్ బాబు (Mahesh Babu) పోషించిన యువకుడి పాత్ర పేరు కూడా పార్థునే. హరికా హాసిని క్రియేషన్స్ నిర్మించనున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించనున్నాడు. దీపావళి తర్వాత సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీతో (Sarkaru vaari paata) బిజీగా ఉన్నాడు.

Also read : Pawan Kalyan remuneration: పవన్ కల్యాణ్ పారితోషికం రూ. 60 కోట్లా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News