Pawan Kalyan birthday: పవన్ కల్యాణ్‌కి బర్త్ డే విషెస్ చెప్పిన Mahesh Babu.. ట్వీట్ వైరల్

Pawan Kalyan birthday wishes: పవర్ స్టార్‌కి బర్త్ డే విషెస్ చెబుతూ సూపర్ స్టార్ పోస్ట్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేడు పవన్ కల్యాణ్‌ బర్త్ డే సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమానులకు కానుకగా భీమ్లా నాయక్ మూవీ టైటిల్ సాంగ్ (Bheemla Nayak title song) విడుదలైంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 2, 2021, 04:50 PM IST
  • పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కి సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే విషెస్.
  • ట్విటర్ ద్వారా పవన్ కల్యాణ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మహేష్ బాబు.
  • 15 నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారిన మహేష్ బాబు ట్వీట్.
Pawan Kalyan birthday: పవన్ కల్యాణ్‌కి బర్త్ డే విషెస్ చెప్పిన Mahesh Babu.. ట్వీట్ వైరల్

Pawan Kalyan birthday wishes: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కి సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే విషెస్ తెలియజేశాడు. ట్విటర్ ద్వారా పవన్ కల్యాణ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మహేష్ బాబు.. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉండాలని, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్టు తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. పవర్ స్టార్‌కి బర్త్ డే విషెస్ చెబుతూ సూపర్ స్టార్ పోస్ట్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

మహేష్ బాబు ట్వీట్ చేసిన తర్వాత 15 నిమిషాల వ్యవధిలోనే 8 వేల రిట్వీట్స్, 17 వేల లైక్స్ నమోదయ్యాయి. ఆ తర్వాత గంట వ్యవధిలోనే దాదాపు 18 వేల రిట్వీట్స్, 46 వేల లైక్స్, రెండు వేలకు పైగా కామెంట్స్ వచ్చిపడ్డాయి. ఈ కారణంగానే మహేష్ బాబు (Mahesh Babu wishes Pawan Kalyan) ట్వీట్ వైరల్ అవుతోంది.

Also read : Samantha surname: పేరు చివరన Akkineni ని తొలగించడంపై స్పందించిన సమంత

నేడు పవన్ కల్యాణ్‌ బర్త్ డే సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమానులకు కానుకగా భీమ్లా నాయక్ మూవీ టైటిల్ సాంగ్ (Bheemla Nayak title song) విడుదలైంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం చేస్తున్న ఇతర సినిమాల నుంచి వేర్వేరు అప్‌డేట్స్ వస్తుండటంతో పవన్ స్టార్ ఫ్యాన్స్‌కి ఈసారి పుట్టిన రోజు వేడుకలు మరింత ప్రత్యేకం అయ్యాయి.

Also read : HBD Pawan Kalyan: వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం.. అభిమానుల ఆరాధ్య దైవం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News