ఇతడే చిన్నారి కట్టప్ప..!

Last Updated : Oct 4, 2017, 01:38 PM IST
ఇతడే చిన్నారి కట్టప్ప..!

బాహుబలి 2 చిత్రంలోని కట్టప్ప పాత్ర ద్వారా లెక్కలేనంతమంది అభిమానులను చేజిక్కించుకున్న నటుడు సత్యరాజ్. తొలుత తమిళ సినిమాల్లో హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించిన సత్యరాజ్ ఆ తర్వాత క్యారెక్టరు ఆర్టిస్టుగా కూడా తన సత్తా చాటారు. హిందీ చిత్రం "చెన్నై ఎక్స్‌ప్రెస్" ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకీ పరిచయమయ్యారు.  అయితే కట్టప్ప పాత్ర ద్వారా యావత్ భారతదేశానికి సత్యరాజ్ అంటే ఎవరో తెలిసి వచ్చింది.  ఆ క్యారెక్టరును బేస్ చేసుకొని ఎన్నో స్ఫూఫ్స్ కూడా వచ్చేశాయి. ఈ రోజు సత్యరాజ్  పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు శిబిరాజ్ తన తండ్రికి ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన చిన్నప్పటి ఫోటోను ట్వీట్ చేశారు. ‘తన నటనతోనే కాకుండా మంచి వ్యక్తిత్వంతో కూడా లక్షలాది మంది ప్రజల హృదయాల్ని గెలుచుకున్న ఈ బాలుడికి జన్మదిన శుభాకాంక్షలు.’ అని ట్వీట్‌ చేశారు. ఇప్పుడు ముద్దులొలికే కట్టప్ప ఫోటో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోంది. 

 

 

Trending News